Telugu Global
Cinema & Entertainment

స‌న్ ఆఫ్ స‌త్య‌మూర్తి బాక్సాఫీస్ రిపోర్ట్

స‌న్ ఆఫ్ స‌త్య‌మూర్తి గ‌త శుక్ర‌వారం ( ఏప్రిల్ 9 ) న విడుద‌ల‌యింది. దాదాపు 63 కోట్ల రూపాయిల‌కు ఈ సినిమా బిజినెస్ చేశారు. అల్లు అర్జున్ రేసు గుర్రం 55 కోట్లు వ‌సూలు చేసింది. ఆ ఆశ (? ) తోనే ఇంత ఎక్కువ రేట్ల‌కి అమ్మారు. ఓవ‌ర్సీస్ లో వ‌ర్కింగ్ డే న రిలీజ్ కావ‌డంతో క‌లెక్ష‌న్ల‌కి బాగా దెబ్బ వేసింది. ఇక తెలుగు రాష్ట్రాల విష‌యానికొస్తే – మార్నింగ్ షో కి […]

స‌న్ ఆఫ్ స‌త్య‌మూర్తి బాక్సాఫీస్ రిపోర్ట్
X

స‌న్ ఆఫ్ స‌త్య‌మూర్తి గ‌త శుక్ర‌వారం ( ఏప్రిల్ 9 ) న విడుద‌ల‌యింది. దాదాపు 63 కోట్ల రూపాయిల‌కు ఈ సినిమా బిజినెస్ చేశారు. అల్లు అర్జున్ రేసు గుర్రం 55 కోట్లు వ‌సూలు చేసింది. ఆ ఆశ (? ) తోనే ఇంత ఎక్కువ రేట్ల‌కి అమ్మారు. ఓవ‌ర్సీస్ లో వ‌ర్కింగ్ డే న రిలీజ్ కావ‌డంతో క‌లెక్ష‌న్ల‌కి బాగా దెబ్బ వేసింది. ఇక తెలుగు రాష్ట్రాల విష‌యానికొస్తే – మార్నింగ్ షో కి బాగా బాడ్ టాక్ వ‌చ్చినా , ఫ‌స్ట్ షో , సెకండ్ షో టైమ్ కి ఓ. కే , ఫ‌ర్లేదు అనే టాక్ స్ర్పెడ్ అయింది. అయితే బ‌య్య‌ర్లు మాత్రం ఉత్సాహంగా లేరు. వాస్త‌వ ప‌రిస్ధితి ఏమిటంటే 30 నుంచి 40 శాతం వ‌ర‌కూ బ‌య్య‌ర్లు కోల్పోతున్నారు. ద‌రిదాపుల్లో వేరే సినిమా లేదు కాబ‌ట్టి ఈ మాత్రం త‌క్కువ న‌ష్టం. ఫ్యామిలీలు వ‌స్తే 40 నుంచి 45 కోట్ల వ‌ర‌కూ రిక‌వ‌ర్ కావ‌చ్చు లేని ప‌క్షంలో స‌గానికి స‌గం పోతుంది, క‌ధ టివి సీరియ‌ల్ లా సాగ‌డం, ఎంట‌ర్ టైన్మెంట్ త‌క్కువ కావ‌డం , త్రివిక్ర‌మ్ ర‌చ‌న‌లో ప‌స త‌గ్గ‌డం ఈ ఫెయిల్యూర్ కి కార‌ణం. అల్లు అర్జున్ 14 కోట్లు , త్రివిక్ర‌మ్ 12.5 కోట్లు రెమ్యుప‌రేషన్ తీసుకున్నార‌ట‌. ఒక వేళ బ‌య్య‌ర్లు ఎక్కువ మొత్తం లో న‌ష్ట‌పోతే ,ఆగడు సినిమా కి హీరో మ‌హేష్ బాబు , ద‌ర్శ‌కుడు శ్రీ‌ను వైట్ల నుంచి డ‌బ్బులు వెన‌క్కి వ‌సూలు చేసిన‌ట్లే ఈ సినిమాకి వ‌సూలు చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌.

First Published:  15 April 2015 4:57 AM GMT
Next Story