మా-ఫ‌లితాల ప్ర‌క‌ట‌న‌కు కోర్టు గ్రీన్ సిగ్న‌ల్‌

మా ఎన్నిక‌ల ఫ‌లితాల విడుద‌ల‌కు సిటీ సివిల్ కోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఓ. క‌ళ్యాణ్‌ వేసిన పిటిష‌న్‌ను కొట్టి వేసింది. కోర్టు స‌మ‌యాన్ని వృధా చేసినందుకు ఆయ‌న‌ను మంద‌లిస్తూ ప‌ది వేల రూపాయ‌ల‌ జ‌రిమానా వేసింది. ఫ‌లితాల ప్ర‌క‌ట‌న అధికారం రిట‌ర్నింగ్ అధికారిదేన‌ని, ఎప్పుడైనా ప్ర‌క‌టించుకోవ‌చ్చ‌ని స్ప‌ష్టం చేసింది. కాగా ఫ‌లితాల ప్ర‌క‌ట‌న‌కు కోర్టు అనుమ‌తించిన దృష్ట్యా వీటిని శుక్ర‌వారంగాని, శ‌నివారంగాని ప్ర‌క‌టిస్తామ‌ని మా ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారి తెలిపారు. ఇదే విష‌యాన్ని ప్ర‌స్తుత అధ్య‌క్షుడు ముర‌ళీమోహ‌న్ కూడా ద్రువీక‌రించారు.-పీఆర్‌