Telugu Global
National

ప్రాధాన్య‌త‌లు గుర్తించలేకపోయాం: సీపీఎం

కేంద్ర రాష్ట్రాల్లో పాలక పార్టీలను ఓడించేందుకు  తక్షణ  క‌ర్త‌వ్యాల్లో నిమగ్నం కావడం వల్లే బలం పెంచుకోలేక పోయామని,  పార్టీ స్వతంత్రంగా ఎదగలేకపోవడానికి ఇదే కార‌ణ‌మ‌ని, మూడో ప్రత్యమ్నాయ ప్రయోగం కూడా పార్టీకి అంతగా లాభించలేదని సీపీఎం జాతీయ మహసభలు అభిప్రాయపడ్డాయి. సొంతంగా బలం పెంచుకునే దిశలో భవిష్యత్తు కార్యచరణను రూపొందింకోవాల‌ని విశాఖ‌లో జ‌రుగుతున్న‌ ఈ మ‌హాస‌భ నిర్ణ‌యించింది. మొదటి రోజు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ అత్యంత కీలకమైన పార్టీ ఎత్తుగడల పంథా ముసాయిదాను ప్రవేశ […]

కేంద్ర రాష్ట్రాల్లో పాలక పార్టీలను ఓడించేందుకు తక్షణ క‌ర్త‌వ్యాల్లో నిమగ్నం కావడం వల్లే బలం పెంచుకోలేక పోయామని, పార్టీ స్వతంత్రంగా ఎదగలేకపోవడానికి ఇదే కార‌ణ‌మ‌ని, మూడో ప్రత్యమ్నాయ ప్రయోగం కూడా పార్టీకి అంతగా లాభించలేదని సీపీఎం జాతీయ మహసభలు అభిప్రాయపడ్డాయి. సొంతంగా బలం పెంచుకునే దిశలో భవిష్యత్తు కార్యచరణను రూపొందింకోవాల‌ని విశాఖ‌లో జ‌రుగుతున్న‌ ఈ మ‌హాస‌భ నిర్ణ‌యించింది. మొదటి రోజు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ అత్యంత కీలకమైన పార్టీ ఎత్తుగడల పంథా ముసాయిదాను ప్రవేశ పెట్టారు. గత 25 సంవత్సరాల కాలంలో అవలంభించిన ఎత్తుగడలపై సమీక్షించారు. జనవరిలో హైద్రాబాద్ లో జరిగిన కేంద్ర కమిటీ ఈ ముసాయిదాను రూపొందించింది. అన్ని స్థాయిల్లో పార్టీ శాఖలు చర్చించి 1432 సవరణలను ప్రతిపాదించారు. వాటిలో 29 సవరణలను జాతీయ మహసభలు ఆమోదించాయి. అనంతరం ఎత్తుగడల ముసాయిదాపై ప్రతినిధులు చర్చలు సాగించారు. మంగళవారం నాడు చర్చల్లో 14 మంది ప్రతినిధులు పాల్గోన్నారు. చర్చలు అత్యంత ప్రజా స్వామికంగా, అర్థవంతంగా, విమర్శనాత్మకంగా జరుగుతున్నాయని పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ స్పష్టం చేశారు. గత పది సంవత్సరాల కాలంగా పార్టీ చేపట్టిన మూడో ప్రత్యామ్నయ ప్రమోగం కూడా పార్టీకి లాభించలేదని సభలు అంచనా వేసాయి. బెంగాల్, కేరళ, త్రిపుర‌ల్లో లాగా వామపక్ష కూటములను ఏర్పాటు చేయలేకపోవడం కూడా పార్టీని నష్టం చేకూర్చిందనే అభిప్రాయాన్ని సభలు వ్యక్త పరిచాయి. దేశ వ్యాప్తంగా బుర్జువా పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ లను వ్యతిరేకిస్తూనే ప్రాంతీయ బుర్జువా పార్టీలతో జట్టుకట్టడాన్ని ప్రజలకు వివరించ లేకపోయామని…అందుకే పార్టీ పట్ల ప్రజల్లో మునపటి ఆదరణ తగ్గిందనే నిర్ధారణ‌ొచ్చారు కామ్రెడ్లు. ఇక యూపీఏ వంటి సంకీర్ణ కూటముల్లో భాగస్వామ్యులు కావడం వల్ల ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయలేకపోయామన్న అభిప్రాయాలను వ్యక్తపరిచారు. కాంగ్రెస్ వంటి సెక్యులర్ బుర్జువా పార్టీలతో ఎట్టి పరిస్థితుల్లోననూ జట్టు క‌ట్ట‌కూడ‌ద‌నే మహసభలు నిర్ణయించినట్టు ప్రకాశ్ కారత్ తెలిపారు
ఇక రెండో రోజు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ సేకరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేశారు. రైతు వ్యతిరేక కార్పోరేట్ అనుకూల భూ చట్టాన్ని తిప్పికొట్టేందుకు ఉద్యమాలను ఉధృతం చేయాలని తీర్మానించాయి. రైతులు, కూలీలు, దళితులు, గిరిజనులతో కలిపి ఉద్యమించాలని నిర్ణయించాయి. ఇక దళితుల సమస్యల పరిష్కారం కోసం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని మహసభలు డిమాండ్ చేశాయి. రాజ్యంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ 125 జయంతి సందర్భంగా తక్షణం పార్లమెంటును సమావేశ పరాచాలని తీర్మానించాయి. పార్టీ స్వతంత్రంగా ఎదిగేందుకు ఈ స‌మావేశాల్లో తయార‌య్యే కొత్త ముసాయిదా దోహద పడుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు కామ్రెడ్లు.
First Published:  15 April 2015 7:23 AM GMT
Next Story