Telugu Global
Arts & Literature

ఏడుగురికి కందుకూరి విశిష్ట పురస్కారాలు

హైదరాబాద్: తెలుగునాటక రంగ దినోత్సవం సందర్భంగా సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం విశిష్ట పురస్కారాలను రాష్ట్ర చలన చిత్ర టివి నాటక రంగ అభివృద్ధి సంస్ధ ప్రకటించింది. గుంటూరు జిల్లా నరసరావుపేటలో జరిగే కార్యక్రమంలో ఈ పురస్కారాలకు ఎంపికైన వారికి అందచేస్తారు. రాష్ట్ర స్ధాయి పురస్కార గ్రహీతలకు రూ. 25 వేల రూపాయల నగదు, జిల్లా స్ధాయి గ్రహీతలకు పదివేల రూపాయలను నగదు పారితోషికంగా అంద‌జేస్తారు. ఈ మొత్తంతోపాటు శాలువాలతో వారిని సత్కరిస్తారు. గుంటూరులో గురువారం జ‌రిగే ఈ […]

హైదరాబాద్: తెలుగునాటక రంగ దినోత్సవం సందర్భంగా సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం విశిష్ట పురస్కారాలను రాష్ట్ర చలన చిత్ర టివి నాటక రంగ అభివృద్ధి సంస్ధ ప్రకటించింది. గుంటూరు జిల్లా నరసరావుపేటలో జరిగే కార్యక్రమంలో ఈ పురస్కారాలకు ఎంపికైన వారికి అందచేస్తారు. రాష్ట్ర స్ధాయి పురస్కార గ్రహీతలకు రూ. 25 వేల రూపాయల నగదు, జిల్లా స్ధాయి గ్రహీతలకు పదివేల రూపాయలను నగదు పారితోషికంగా అంద‌జేస్తారు. ఈ మొత్తంతోపాటు శాలువాలతో వారిని సత్కరిస్తారు. గుంటూరులో గురువారం జ‌రిగే ఈ కార్యక్రమంలో స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ముఖ్యఅతిథిగా పాల్గొంటారని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రకటించారు. రాష్ట్ర స్ధాయి కందుకూరి విశిష్ట పురస్కార గ్రహీతలుగా ప్రకాశం జిల్లాకు చెందిన కోకా సంజీవరావు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన కిలారు లక్ష్మి, కర్నూలు నుంచి పి ఓబులయ్య, గుంటూరు నుంచి ఐ రాజ్‌కుమార్, ప్రకాశం నుంచి మాలకొండా రెడ్డీ, గుంటూరు నుంచి జి.ఎస్‌.ఆర్‌.కె. శాస్ర్తీ, కడప నుంచి వలీ సాహెబ్‌ను ఎంపిక చేశారు. ఇక ప్ర‌తి జిల్లా నుంచి కొంత‌మందిని ఈ విశిష్ట పుర‌స్కారాల‌కు ఎంపిక చేశారు.-పీఆర్‌
First Published:  15 April 2015 6:00 AM GMT
Next Story