Telugu Global
Others

భుసేక‌ర‌ణ‌కు మీడియా స‌హ‌కారం కోరిన మంత్రి ?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని నిర్మాణానికి భూములు ఇవ్వ‌డానికి నిరాక‌రిస్తున్న రైతుల మైండ్‌సెట్ మార్చ‌డానికి ప్ర‌భుత్వం మీడియా స‌హ‌కారాన్ని కోరుతోంది. రాజ‌ధాని భూ సేక‌ర‌ణ వ్య‌వ‌హారాల‌ను చూస్తున్న మంత్రి ఒక‌రు కొన్ని తెలుగు ఛాన‌ల్స్ అధినేత‌ల‌కు ఫోన్ చేసి ఈ విష‌యంలో త‌మ‌కు సాయం చేయాల్సిందిగా అభ్య‌ర్థించిన‌ట్టు స‌మాచారం. హైకోర్టు తుది తీర్పు వెలువ‌డ‌డానికి ముందే రైతులు భూములు ఇవ్వ‌క‌పోతే అన్ని విధాలా తీవ్రంగా న‌ష్ట‌పోతార‌ని, ఇచ్చిన వాళ్ళ‌కు మాత్ర‌మే ప‌రిహారం స‌క్ర‌మంగా అందుతుంద‌న్న‌ట్టు క‌థ‌నాలివ్వాల‌ని ఆయ‌న కోరారు… కోర్టు […]

భుసేక‌ర‌ణ‌కు మీడియా స‌హ‌కారం కోరిన మంత్రి ?
X

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని నిర్మాణానికి భూములు ఇవ్వ‌డానికి నిరాక‌రిస్తున్న రైతుల మైండ్‌సెట్ మార్చ‌డానికి ప్ర‌భుత్వం మీడియా స‌హ‌కారాన్ని కోరుతోంది. రాజ‌ధాని భూ సేక‌ర‌ణ వ్య‌వ‌హారాల‌ను చూస్తున్న మంత్రి ఒక‌రు కొన్ని తెలుగు ఛాన‌ల్స్ అధినేత‌ల‌కు ఫోన్ చేసి ఈ విష‌యంలో త‌మ‌కు సాయం చేయాల్సిందిగా అభ్య‌ర్థించిన‌ట్టు స‌మాచారం.
హైకోర్టు తుది తీర్పు వెలువ‌డ‌డానికి ముందే రైతులు భూములు ఇవ్వ‌క‌పోతే అన్ని విధాలా తీవ్రంగా న‌ష్ట‌పోతార‌ని, ఇచ్చిన వాళ్ళ‌కు మాత్ర‌మే ప‌రిహారం స‌క్ర‌మంగా అందుతుంద‌న్న‌ట్టు క‌థ‌నాలివ్వాల‌ని ఆయ‌న కోరారు… కోర్టు తీర్పు వ్య‌తిరేకంగా వ‌చ్చినా ప్ర‌భుత్వం ఏదో ర‌కంగా భూముల‌ను స్వాధీనం చేసుకుంటుంది కాబ‌ట్టి, ఇవ్వ‌ని వాళ్ళు రెండు విధాలా న‌ష్ట‌పోతార‌నే విధంగా ఫోక‌స్ చేయాల‌ని ఆయ‌న కోరిన‌ట్టు తెలిసింది. ఈ విష‌యంలో రైతులు భ‌య‌ప‌డి భూములు అప్ప‌గించే విధంగా క‌థ‌నాలు ప్ర‌సారం చేయాల‌ని సంబంధిత మంత్రి మీడియా అధిప‌తులను కోరిన‌ట్టు తెలిసింది.

First Published:  15 April 2015 3:19 AM GMT
Next Story