నాన్న‌లు బాబోయ్ నాన్నలు

తెలుగు సినిమాకి ఒకో సీజ‌న్ లో ఒకో జ్వ‌రం పుట్టుకొస్తుంటుంది. ఒక‌ఫ్పుడు రివెంజ్ , అమ్మ సెంటిమెంట్, మాఫియా, త‌ర్వాత హీరో విల‌న్ ఇంట్లో చేరి వాడ్నివెధ‌వ‌ని చేయడం. ఇఫ్పుడు నాన్న సెంటిమెంట్.. బాక్సాఫీస్ ఇంకా స‌న్ ఆఫ్ స‌త్య‌మూర్తి దెబ్బ నుంచి కోలుకోక ముందే , మ‌రికొంత మంది నాన్న‌లు రెడీ అవుతున్నారు. మ‌హేష్ బాబు – కొర‌టాల శివ కాంబినేష‌న్ లో వ‌స్తున్న శ్రీ‌మంతుడు ఫాదర్ సెంటిమెంటే అట‌, తండ్రి పాత్ర‌లో జ‌గ‌ప‌తిబాబు న‌టిస్తున్నాడు . శ్రీ కాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వం లో రూపొందే బ్ర‌హ్మోత్స‌వం లో కూడా నాన్నసెంటిమెంట్ ఉందట. ఎన్.టి.ఆర్ – సుకుమార్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న ‘నాన్న‌కి ప్రేమతో’ అయితే చెప్ప‌నే అక్క‌ర్లేదు. టైటిల్ లోనే సెంటిమెంట్ పొంగిపోతుంది. మ‌రో వైపు పూరీ జ‌గ‌న్నాధ్ – నితిన్ మా అమ్మ సీతామ‌హాల‌క్ష్మి అనంటున్నారు. మ‌రి కొంత మంది కూడా ఇలాంటి సెంటిమెంట్స్ తో క‌ధ‌లు రెడీ చేసి, స‌న్ ఆఫ్ స‌త్య‌మూర్తి దెబ్బ‌కి పున‌రాలోచ‌న‌లో ప‌డ్డారట‌.