వైఎస్ జగన్ ప్రాజెక్టుల యాత్ర ప్రారంభం

రాజమండ్రి : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన తన బస్సు యాత్రను బుధవారం ఉదయం ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి విమానంలో మధురపూడి విమానాశ్రయం చేరుకున్న వైఎస్ జగన్, అక్కడి నుంచి నేరుగా ధవళేశ్వరం బ్యారేజి వద్దకు వెళ్లారు. అక్క‌డ ఆయ‌న‌కు  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. వీరితోపాటు పార్టీ వ్యవసాయ విభాగం అధ్యక్షుడు ఎన్వీఎస్ నాగిరెడ్డి తదితరులు బ‌స్సు యాత్ర‌లో పాల్గొంటున్నారు. ప్రాజెక్టుల యాత్ర‌లో భాగంగా ఆయ‌న ముందుగా ధ‌వ‌ళేశ్వ‌రం ప్రాజెక్టును సంద‌ర్శిస్తారు. అనంత‌రం ఆయ‌న ప‌ట్టిసీమ వెళ‌తారు. ప‌ట్టిసీమ ప్రాజెక్టు వ‌ల్ల ఉభ‌య గోదావ‌రి జిల్లాలు ఎలాంటి న‌ష్టానికి గుర‌వుతాయో ఆయ‌న ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తారు. జ‌గ‌న్ రాజ‌మండ్రి చేరుకోగానే ఆయ‌న‌కు పెద్ద ఎత్తున కార్య‌క‌ర్త‌లు స్వాగ‌తం ప‌లుకుతూ జై జ‌గ‌న్‌, జై వైఎస్ఆర్‌సీపీ అంటూ నినాదాలు చేశారు.-పీఆర్‌