Telugu Global
Cinema & Entertainment

స‌న్నీలియాన్ కు ఝ‌ల‌క్‌..

హాట్ బ్యూటీలంటే వారెవ్వా అనిపించే ఫిజిక‌ల్ బ్యూటీతో అభిమానుల ప‌ల్స్ పెంచుతారు. అలా మెప్పించినంత కాల‌మే స్పెష‌ల్ డాన్స‌ర్ స్టేట‌స్ ఉంటుంది. ఇదే త‌ర‌హాలో స‌న్నీలియాన్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వ‌డానికి ముందు వ‌రకు మ‌ల్లిక శెరావ‌త్, మ‌లైకా అరోరా, బిపాస బ‌సు వంటి హాట్ బ్యూటీస్ మెప్పించారు. అయితే జీస్మ్ 2తో బాలీవుడ్ తెర‌కు దూసుకొచ్చిన పోర్న్ స్టార్ స‌న్నీలియాన్ దెబ్బ‌కు అంతా రివ‌ర్స్ అయ్యింది. వాళ్లందరిని చాల త‌క్కువ టైమ్ లో ఓవ‌ర్ టేక్ […]

స‌న్నీలియాన్ కు ఝ‌ల‌క్‌..
X

హాట్ బ్యూటీలంటే వారెవ్వా అనిపించే ఫిజిక‌ల్ బ్యూటీతో అభిమానుల ప‌ల్స్ పెంచుతారు. అలా మెప్పించినంత కాల‌మే స్పెష‌ల్ డాన్స‌ర్ స్టేట‌స్ ఉంటుంది. ఇదే త‌ర‌హాలో స‌న్నీలియాన్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వ‌డానికి ముందు వ‌రకు మ‌ల్లిక శెరావ‌త్, మ‌లైకా అరోరా, బిపాస బ‌సు వంటి హాట్ బ్యూటీస్ మెప్పించారు. అయితే జీస్మ్ 2తో బాలీవుడ్ తెర‌కు దూసుకొచ్చిన పోర్న్ స్టార్ స‌న్నీలియాన్ దెబ్బ‌కు అంతా రివ‌ర్స్ అయ్యింది. వాళ్లందరిని చాల త‌క్కువ టైమ్ లో ఓవ‌ర్ టేక్ చేసి బాలీవుడ్ ఐట‌మ్ సాంగ్స్ సామ్ర జ్యాన్ని సోలో గా స‌న్నీలియాన్ ఏలుకుంటుంది. అయితే మ‌న టాలీవుడ్ డైరెక్ట‌ర్ క్రిష్ బాలీవుడ్ లో అక్ష‌య్ కుమార్ లీడ్ రోల్ గా గ‌బ్బ‌ర్ ఈజ్ బ్యాక్ అనే చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో చిత్రాంగద ఒక ఐట‌మ్ సాంగ్ చేసింది. ఆవో రాజా అని ‘యోయో హాని సింగ్’ కంపోజ్ చేసిన సాంగ్ కు చిత్రాంగద మెరుపులు మెరిపించింది. చిత్రాంగద చేసిన అందాల వింద‌కు సోష‌ల్ నెట్ వ‌ర్క్ లో దిమ్మ తిరిగే రెస్పాన్స్ వ‌స్తుంది. అన్నింటికి మించి చిత్రాంగద అందాల విందకు స‌న్నీలియాన్ కూడా షాక్ అయ్యింద‌ని స‌మాచారం. ఇప్ప‌టి వ‌ర‌కు త‌న‌ను ఓవర్ టేక్ చేసే హాట్ బ్యూటీ ఎవ‌రు లేర‌ని ఆనంద ప‌డుతున్న ఈ కెన‌డా బ్యూటీకి చిత్రాంగద ఆవో రాజా సాంగ్ బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి నిద్ర క‌రువైందనే టాక్ బాలీవుడ్ లో వినిపిస్తుంది మ‌రి.

First Published:  15 April 2015 9:21 PM GMT
Next Story