అనుమానం తీర్చిన మన్మధుడు

హీరో నాగార్జున కొత్త ఛానెల్ పెట్టబోతున్నాడని… ఆ వినోద ఛానెల్ పేరు మనం అని కూడా ప్రచారం జరిగింది. ఇన్నాళ్లూ ఫిలింనగర్ లో చక్కర్లు కొట్టిన ఈ రూమర్ ను నాగ్ కొట్టిపడేశాడు. తను ఎలాంటి ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ పెట్టడం లేదని అధికారికంగా ప్రకటించాడు. మాటీవీలో వాటాలన్నీ అమ్మేసుకున్నప్పటి నుంచి ఈ రూమర్లు వస్తూనే ఉన్నాయి. ఆ వచ్చిన డబ్బుతో నాగార్జున మరో ఛానెల్ పెడతారనే ప్రచారం జోరుగా సాగింది. గతంలోలా చిరంజీవిని పార్ట్ నర్ గా చేసుకోకుండా.. పీవీపీ సంస్థతో కలిసి కొత్త ఛానెల్ పెడతారనే వార్తలు వచ్చాయి. అంతేకాదు.. ప్రస్తుతం మాటీవీలో నడుస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమం లాంటిదే కొత్త ఛానెల్ లో కూడా పెట్టే ఆలోచనలో ఉన్నారని కూడా వదంతులు వ్యాపించాయి. మొత్తానికి నాగార్జున స్టేట్ మెంట్ తో ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది. మరి మన్మధుడి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? వెయిట్ అండ్ సీ…