Telugu Global
Cinema & Entertainment

అనుష్క సొంత తెలివితేట‌లు వాడ‌ద‌ట‌..!

అనుష్క ముద్దుగుమ్మా.. లేక బొద్దుగుమ్మా..? ప‌్ర‌స్తుతం  క‌నిపిస్తున్న ప‌ర్స‌నాలిటి ప్ర‌కారం  ముద్దుగా వున్న బొద్దుగుమ్మ అనాల్సిందే.  స‌రే ప‌ర్స‌నాలిటిది ఏముంది త‌ను  గ‌ట్టిగా వ‌ర్కువుట్ చేస్తే  ఒక నెల రోజుల్లో   జీరో సైజ్  చేయ‌గ‌ల‌దు. అస‌లే ప‌వ‌ర్ యోగా తెలిసిన టీచ‌ర్. ఇక న‌టిగా   సినిమా చేయ‌డానికి  అంగీక‌రించిన త‌రువాత .. ఎట్టి ప‌రిస్థితుల్లోను సొంత ఆలోచ‌న చేయ‌ద‌ట‌.  డైరెక్ట‌ర్స్ ఏది చెబితే అదే చేస్తానంటోంది. డైరెక్ట‌ర్స్  కి  ఏవ‌రి రోల్  ఎంత ఇంపార్టెన్స్ […]

anushka shetty physique, anuska shetty hot
X
అనుష్క ముద్దుగుమ్మా.. లేక బొద్దుగుమ్మా..? ప‌్ర‌స్తుతం క‌నిపిస్తున్న ప‌ర్స‌నాలిటి ప్ర‌కారం ముద్దుగా వున్న బొద్దుగుమ్మ అనాల్సిందే. స‌రే ప‌ర్స‌నాలిటిది ఏముంది త‌ను గ‌ట్టిగా వ‌ర్కువుట్ చేస్తే ఒక నెల రోజుల్లో జీరో సైజ్ చేయ‌గ‌ల‌దు. అస‌లే ప‌వ‌ర్ యోగా తెలిసిన టీచ‌ర్. ఇక న‌టిగా సినిమా చేయ‌డానికి అంగీక‌రించిన త‌రువాత .. ఎట్టి ప‌రిస్థితుల్లోను సొంత ఆలోచ‌న చేయ‌ద‌ట‌. డైరెక్ట‌ర్స్ ఏది చెబితే అదే చేస్తానంటోంది. డైరెక్ట‌ర్స్ కి ఏవ‌రి రోల్ ఎంత ఇంపార్టెన్స్ అనేది వారికి తెలిసే వుంటుంది కాబ‌ట్టి. ఆ విష‌యంలో స‌లహాలు లాంటివి ఇచ్చి వాళ్ల ఈగోను హ‌ర్ట్ చేయ‌డం వంటి ప‌నులు చేయ‌న‌ని చెప్పింది.
అయినా క‌థ ప‌ట్ల వారికి వున్న క్లారిటి హీరోయిన్ గా నాకు ఉండ‌దు కాబ‌ట్టి ఉచిత స‌ల‌హాలు ఇవ్వ‌డం కంటే సైలెంట్ గా ఉండ‌టం ఉత్తమం క‌దా అని తెలిపింది. న‌టిగా ప‌ది సంవ‌త్స‌రాలు కంప్లీట్ చేసుకున్న అనుష్క ..సీనియారిటి అనేది ప‌ది సంవ‌త్స‌రాల‌కే రాద‌ని తేల్చింది. క‌నీసం ఇరవై సంవ‌త్స‌రాలు ఇండ‌స్ట్రీలో వుంటే అప్పుడు సీనియారిటి అనే విష‌యాన్ని మాట్లాడ‌లంటోంది . ఇక బాహుబ‌లి , రాణిరుద్ర‌మ చిత్రాలు త‌న కెరీర్ లో బెస్ట్ పిల్మ్స్ అవుతాయ‌ని ఆశిస్తుంది.
First Published:  17 April 2015 3:14 AM GMT
Next Story