Telugu Global
Others

చైనాలో ‘బాబు’, సేదదీరిన మంత్రులు ?

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చైనా పర్యటనకు వెళ్ళడంతో మంత్రులకు ఆట విడుపు ఇచ్చినట్లయ్యింది. దాంతో సచివాలయం బోసిపోయింది. అసలు ప్రభుత్వం ఉందా ? లేదా ? అనే విధంగా పరిపాలనా స్తంభించిపోగా ముంత్రులు దాదాపుగా విశ్రాంతి తీసుకుంటున్నారు. అంటే దీని అర్థం చంద్రబాబు ఉంటే పరిపాలన అద్భుతంగా ఉన్నట్లు, ఆయన ఇక్కడలేకపోతే పరిపాలన అస్తవ్యస్థమైపోయినట్లు కాదు. మామూలుగా అయితే చంద్రబాబు పరిపాలన హైటెక్‌ హంగులతో ప్రచారార్భాటంతో సాగిపోతుంటుంది. ఆ క్రమంలో భాగంగా ఆయన అనుత్పాదక పని ఎక్కువగా […]

చైనాలో ‘బాబు’, సేదదీరిన మంత్రులు ?
X

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చైనా పర్యటనకు వెళ్ళడంతో మంత్రులకు ఆట విడుపు ఇచ్చినట్లయ్యింది. దాంతో సచివాలయం బోసిపోయింది. అసలు ప్రభుత్వం ఉందా ? లేదా ? అనే విధంగా పరిపాలనా స్తంభించిపోగా ముంత్రులు దాదాపుగా విశ్రాంతి తీసుకుంటున్నారు. అంటే దీని అర్థం చంద్రబాబు ఉంటే పరిపాలన అద్భుతంగా ఉన్నట్లు, ఆయన ఇక్కడలేకపోతే పరిపాలన అస్తవ్యస్థమైపోయినట్లు కాదు. మామూలుగా అయితే చంద్రబాబు పరిపాలన హైటెక్‌ హంగులతో ప్రచారార్భాటంతో సాగిపోతుంటుంది. ఆ క్రమంలో భాగంగా ఆయన అనుత్పాదక పని ఎక్కువగా చేస్తుంటారనే విమర్శ కూడా ఉంది. ఆ పనిలో భాగంగానే ఉన్నతాధికారులు, సంబంధిత మంత్రులతో ఆయన రోజూ గంటల తరబడి సమీక్షలు, వీడియో కాన్ఫరెన్స్‌లు, టెలీ మీటింగ్‌లు లాంటివి హైటెక్‌ పద్ధతిలో నిర్వహిస్తూనే ఉంటారు. దాంతో మంత్రులు గంటల తరబడి సమీక్షా సమావేశాలలో నిమిత్త మాత్రులుగానే కూర్చుండిపోవాల్సి వస్తోందని పలువురు మంత్రులు తరచూ వాపోతుంటారు. ఫలితంగా వారికి విసుగు, చికాకు కలిగినా బయటకు కనిపించనీయకుండా పైకి ఉత్సాహంగా కనిపిస్తుంటారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు తరచూ విదేశీ పర్యటనలకు వెళుతున్నారు. ఈసారి ఆయన ఆరు రోజలపాటు చైనా పర్యటనకు వెళ్ళారు. అక్కడి నుంచి ఈ రోజు రాత్రి తిరిగి వచ్చేస్తున్నారు. ఆయన అటు ఇద్దరు మంత్రులు,అధికారుల బృందంతో కలిసి చైనాకు వెళ్ళగానే అందరు మంత్రులు జిల్లాలకు, నియోజకవర్గాలకు చెక్కేశారు. కొందరు శాఖలకు సంబంధించిన క్షేత్రస్థాయి పనుల్లోను, పార్టీ, నియోజకవర్గాల పనుల్లోను ఉండగా అత్యధికులు మాత్రం తమకు రిలీఫ్‌ దొరికిందంటూ ఆట విడుపు తీసుకున్నారు. ఈ పరిస్థితి ఈ నెల 22 వరకూ కొనసాగనుంది. ఆ రోజున ఎపి మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఆ సమావేశానికే అత్యధిక మంత్రులు నేరుగా రానున్నారు. ఈ వారం రోజుల పాటు కొందరు మంత్రులు సేదతీరితే మరి కొందరు స్వంత పనులు చక్కబెట్టుకున్నారు. ఫలితంగా సచివాలయం వెలవెలపోతోంది. మంత్రుల పేషీలు ఖాళీగా ఉన్నాయి. అధికారులు రావటంలేదు. దాంతో పనులు మీద వచ్చే సందర్శకులు సంఖ్య గణనీయంగా పడిపోయింది. కొందరు మంత్రులు ముఖ్యంగా దేవినేని ఉమ, నారాయణ, పుల్లారావు లాంటి వారు కొందరు ఆయా శాఖల పనులమీద క్షేత్రసాయిలో ఉన్నారు. నారాయణ, పుల్లారావు ‘అమరావతి‘లో బిజీగా ఉన్నారు. అత్యధికులు మాత్రం హైటెక్‌ తలనొప్పి తగ్గిందని రిలీఫ్‌తో సేదదీరుతున్నారు. మళ్ళీ రేపటి నుంచి మరీ ముఖ్యంగా 22 నుంచి వారికి ఆ సమీక్షల భారం తప్పదని భయపడుతున్నారు. ‘‘ అయినా ముఖ్యమంత్రి ఇక్కడ లేనప్పుడు తామిక్కడ ఉండి చేయగలిగిందేముంటుంది ? మేం ఎప్పుడూ నిమిత్తమాత్రులమే కదా? అంతా ఆ నలుగురే కదా చూసుకుంటున్నది. మా మాట మేము నిర్వహిస్తున్న శాఖల్లోనైనా చెల్లుబాటు అవుతుందా ఏమిటి ?’’ అంటూ కొందరు నిరుత్సాహంతో నిట్టూరుస్తున్నారు..

First Published:  17 April 2015 4:19 AM GMT
Next Story