పక్కా తెలంగాణ సినిమా

 తన ప్రతి సినిమాని నూతన నటీనటులతో తీయడం దర్శకుడు తేజకి బాగా అలవాటు. ప్రతి సినిమాకి ఓ టాలెంట్ హంట్ పెట్టి అందులోంచి హీరోహీరోయిన్లతో పాటు మిగతా నటీనటులందర్నీ ఎంచుకుంటాడు. ఈసారి కూడా తన కొత్త సినిమాకు పాత పద్దతినే ఫాలో అవుతున్నాడు తేజ. అయితే ఇందులో కూడా ఓ ట్విస్ట్ ఇచ్చాడు. ఈసారి టాలెంట్ హంట్ ను పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికే పరిమితం చేశాడు. అంటే పూర్తిగా తెలంగాణ నటీనటులతోనే సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడన్నమాట. ఈ సినిమాకి హోరాహోరీ అనే టైటిల్ కూడా పెట్టేశాడు తేజ. తెలంగాణ నటీనటులతోనే సినిమా తీయాలని నిర్ణయించుకున్న తేజ, సినిమాలో కూడా తెలంగాణ యాసకే ప్రాధాన్యం ఇస్తాడా లేక రొటీన్ పద్దతిలోనే సినిమా తీస్తాడా అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. మొత్తమ్మీద తేజ నయా మూవీ హోరాహోరీ మాత్రం పక్కా తెలంగాణ చిత్రం అనే ముద్ర వేయించుకుంది.