Telugu Global
Cinema & Entertainment

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన చైతూ

భారీ అంచనాల మధ్య తెరకెక్కింది దోచెయ్ సినిమా. ఈ సినిమాతో ఈ సమ్మర్ లో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యాడు నాగచైతన్య. స్వామి రారా ఫేం సుధీర్ వర్మతో కలిసి దోచేయ్ సినిమా చేశాడు. వన్-నేనొక్కడినే సినిమాలో హీరోయిన్ గా నటించిన కృతి సనోన్ ఈ సినిమాలో చైతూ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. సమ్మర్ ఎట్రాక్షన్ గా ఏప్రిల్ 24న దోచేయ్ సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని భావిస్తున్నారు.  […]

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన చైతూ
X
భారీ అంచనాల మధ్య తెరకెక్కింది దోచెయ్ సినిమా. ఈ సినిమాతో ఈ సమ్మర్ లో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యాడు నాగచైతన్య. స్వామి రారా ఫేం సుధీర్ వర్మతో కలిసి దోచేయ్ సినిమా చేశాడు. వన్-నేనొక్కడినే సినిమాలో హీరోయిన్ గా నటించిన కృతి సనోన్ ఈ సినిమాలో చైతూ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. సమ్మర్ ఎట్రాక్షన్ గా ఏప్రిల్ 24న దోచేయ్ సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని భావిస్తున్నారు.

దోయేయ్ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు నాగచైతన్య. ఎందుకంటే ఈ ఏడాది చైతూకు ఇదే తొలి సినిమా. పైగా గతేడాది ఈ అక్కినేని హీరోకి వరుసగా రెండు ఫ్లాపులొచ్చాయి. ఆటోనగర్ సూర్య, ఒక లైలా కోసం సినిమాలు రెండూ ఆడలేదు. మనం సినిమా హిట్టయినా ఆ క్రెడిట్ హోల్ సేల్ గా అక్కినేని కుటుంబానికి దక్కింది తప్ప సోలోగా చైతూకు రాలేదు. కాబట్టి ఈ ఏడాది దోచేయ్ తో సోలో హిట్ కొట్టాలనుకుంటున్నాడు నాగచైతన్య.

First Published:  17 April 2015 9:30 AM GMT
Next Story