Telugu Global
Others

మ‌రో 5 మృత‌దేహాల‌కు రీ-పోస్టుమార్టం

శేషాచ‌లం ఎన్‌కౌంట‌ర్‌పై శుక్ర‌వారం విచార‌ణ‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి మ‌రో ఎదురుదెబ్బ త‌గిలింది. ఈ ఎన్‌కౌంట‌ర్ మృతుల్లో ఐదుగురికి మ‌ళ్ళీ పోస్టుమార్టం నిర్వ‌హించాల‌ని హైకోర్టు ఆదేశించింది. నిమ్స్‌లో ఫోరెన్సిక్ నిపుణులు లేనందున ఉస్మానియా నుంచిగాని, గాంధీ ఆస్ప‌త్రి నుంచిగాని నిపుణుల‌ను పంపించాల‌ని కోర్టు ఆదేశించింది. రీ పోస్టుమార్టం నిర్వ‌హ‌ణ‌కు అయ్యే ఖ‌ర్చుల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ‌మే భ‌రించాల‌ని సూచించింది. గురువారం మృతుడు శ‌శికుమార్ భార్య మ‌రియ‌మ్మ పెట్టుకున్న‌ పిటిష‌న్‌పై హైకోర్టు తీర్పునిస్తూ అత‌ని మృత‌దేహానికి కూడా రీ పోస్టుమార్టం నిర్వ‌హించాల‌ని […]

AP High Court
X

శేషాచ‌లం ఎన్‌కౌంట‌ర్‌పై శుక్ర‌వారం విచార‌ణ‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి మ‌రో ఎదురుదెబ్బ త‌గిలింది. ఈ ఎన్‌కౌంట‌ర్ మృతుల్లో ఐదుగురికి మ‌ళ్ళీ పోస్టుమార్టం నిర్వ‌హించాల‌ని హైకోర్టు ఆదేశించింది. నిమ్స్‌లో ఫోరెన్సిక్ నిపుణులు లేనందున ఉస్మానియా నుంచిగాని, గాంధీ ఆస్ప‌త్రి నుంచిగాని నిపుణుల‌ను పంపించాల‌ని కోర్టు ఆదేశించింది. రీ పోస్టుమార్టం నిర్వ‌హ‌ణ‌కు అయ్యే ఖ‌ర్చుల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ‌మే భ‌రించాల‌ని సూచించింది. గురువారం మృతుడు శ‌శికుమార్ భార్య మ‌రియ‌మ్మ పెట్టుకున్న‌ పిటిష‌న్‌పై హైకోర్టు తీర్పునిస్తూ అత‌ని మృత‌దేహానికి కూడా రీ పోస్టుమార్టం నిర్వ‌హించాల‌ని ఆదేశించిన విష‌యం తెలిసిందే. అయితే ఈ పోస్టుమార్టం చెన్నైలో జ‌ర‌గాల‌ని, అందుకు నిమ్స్ నుంచి ముగ్గురు వైద్యుల‌ను పంపాల‌ని, ఇందుకు అయ్యే ఖ‌ర్చుల‌ను ఏపీ ప్ర‌భుత్వ‌మే భ‌రించాల‌ని కూడా చెప్పింది. కాగా శేషాచ‌లం ఎన్‌కౌంట‌ర్లో మ‌ర‌ణించిన వారిలో మొత్తం ఆరు మృత‌దేహాల‌కు మ‌రోసారి పోస్టుమార్టం నిర్వ‌హించాల‌ని ఆదేశించిన‌ట్ట‌య్యింది.-పీఆర్‌

First Published:  17 April 2015 4:00 AM GMT
Next Story