వందో సినిమాపై వేలాది అంచనాలు..

Balakrishna 100 Movie
బాలయ్య ప్రస్తుతం లయన్ సినిమా పూర్తిచేశాడు. ఈ సినిమాని వచ్చేనెల 1న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత తన 99వ సినిమాగా శ్రీవాస్ దర్శకత్వంలో వెంటనే మరో సినిమాని స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు బాలకృష్ణ. అయితే ఈ రెండు మూవీస్ కంటే ఎక్కువగా ఇంకా ప్రారంభంకాని వందో సినిమాపైనే నందమూరి అభిమానులు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. బాలయ్య వందో సినిమాకు ఏ పేరు పెట్టారు.. ఆ సినిమాలో బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ నటిస్తాడా.. లాంటి విషయాలపై నందమూరి కాంపౌండ్ లో హాట్ హాట్ చర్చ జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం బోయపాటి శ్రీను దర్శకత్వంలో వందో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు నందమూరి బాలయ్య. ఇప్పటికే వీళ్లిద్దరి కాంబినేషన్ లో సింహా, లెజెండ్ సినిమాలొచ్చి సూపర్ హిట్టయ్యాయి. ఇప్పుడు హ్యాట్రిక్ మూవీగా, అదికూడా వందో సినిమాగా బోయపాటితో మరో మూవీ చేయాలని ఫిక్స్ అయ్యాడు బాలయ్య. ఈ సినిమాకు ప్రస్తుతానికి చరిత్రకు ఒక్కడు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. బాలయ్యతో పాటు మరికొందరు సన్నిహితులు కూడా  ఓకే చేస్తే దాదాపుగా ఇదే టైటిల్ ను ఫిక్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు బాలయ్య వందో సినిమాలో హీరోయిన్ కోసం కూడా వేట మొదలైంది.