తెలంగాణ వ‌ర్శిటీల‌కు ఇన్‌ఛార్జి వీసీలు

తెలంగాణ‌లోని ఐదు యూనివ‌ర్శిటీల‌కు ఇన్‌ఛార్జి వైస్ ఛాన్స‌ల‌ర్‌ల‌ను ప్ర‌భుత్వం నియ‌మిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. శాత‌వాహ‌న విశ్వ విద్యాల‌యం ఇన్‌ఛార్జి వీసీగా ప్రొఫెస‌ర్ వీరారెడ్డిని, కాక‌తీయ యూనివ‌ర్శిటీ ఇన్‌ఛార్జి వీసీగా స్కూలు ఎడ్యుకేష‌న్ డైరెక్ట‌ర్ చిరంజీవులును, మ‌హాత్మాగాంధీ విశ్వ‌విద్యాల‌యం ఇన్‌ఛార్జి వీసీగా వాణి ప్ర‌సాద్‌ను, పొట్టి శ్రీ‌రాములు తెలుగు విశ్వ‌విద్యాల‌యానికి, ఉస్మానియా యూనివ‌ర్శిటీల‌కు క‌లిసి ఇన్‌ఛార్జీ వైస్ ఛాన్స‌ల‌ర్‌గా ప్రొఫెస‌ర్ శివారెడ్డిని నియ‌మిస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. త‌దుప‌రి ఉత్త‌ర్వులు వ‌చ్చే వ‌ర‌కు వీరే వీసీలుగా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తార‌ని ఆ ఉత్త‌ర్వుల్లో ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది.