భక్తకన్న‌ప్పను పక్కన పెట్టినట్టేనా?

Tanikela Bharani
Tanikella Bharanai
తాజాగా మరో ప్రాజెక్ట్ ప్రకటించారు దర్శకనటుడు తనికెళ్ల భరణి. ఇప్పటికే మిధునంతో ఓ మంచి దర్శకుడు అనిపించుకున్న భరణి, ఇప్పుడు మృదుల అనే నయా ప్రాజెక్ట్ ను సెట్స్ పైకి తీసుకొచ్చే పనిలో బిజీగా ఉన్నారు. మహిళా ప్రాధాన్యం కలిగిన ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు కథ-స్క్రీన్ ప్లే విభాగాలు కూడా అతనే చూసుకుంటున్నారు. అయితే మృదుల సినిమా పనులు ప్రారంభించడంతో, భరణి ప్రతిష్టాత్మక చిత్రం భక్త కన్నప్పపై అనుమానాలు ఎక్కువయ్యాయి. 
 శివభక్తుడు భక్తకన్నప్ప సినిమాను సునీల్ తో కలిసి తీస్తానని దాదాపు ఏడాది కిందటే ప్రకటించాడు భరణి. సునీల్ కూడా ఆ ప్రాజెక్ట్ ను కన్ ఫర్మ్ చేశాడు. అయితే అది ఇప్పటివరకు సెట్స్ పైకి రాలేదు. కనీసం ప్రాజెక్ట్ ఏ దశలో ఉందనే విషయం కూడా ఎవరికీ తెలీదు. ఇలాంటి టైమ్ లో మృదుల ప్రాజెక్ట్ ను లైమ్ లైట్ లోకి తెచ్చారు భరణి. అంటే.. భక్త కన్నప్పను పక్కనపెట్టినట్టేనా?