Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 58

వా’నరుడు‘ కొడుకు : అమ్మా! మనం కోతుల్నించి వచ్చామని నాన్న చెప్పాడు నిజమేనా? తల్లి : ఏమెనాన్నా! నాకు మీ నాన్నగారి కుటుంబం గురించి అంతగా తెలీదు. చెత్త తిండి కస్టమర్‌ : వెయిటర్‌! ఈ తిండి చూస్తుంటే నాకు డోకు వస్తోంది. మీ మేనేజర్‌ని పిలువు. వెయిటర్‌ : సారీ సర్‌! ఆయన ఇంతకుముందే బయట భోం చేయడానికి వెళ్ళారు. బాల్‌ బీటింగ్‌ రాజారావు : ‘అబ్బాయ్‌! ఈ క్రికెట్‌ బాల్‌ నీదేనా? వెంకట్‌ : […]

వా’నరుడు

కొడుకు : అమ్మా! మనం కోతుల్నించి వచ్చామని నాన్న చెప్పాడు నిజమేనా?
తల్లి : ఏమెనాన్నా! నాకు మీ నాన్నగారి కుటుంబం గురించి అంతగా తెలీదు.

చెత్త తిండి

కస్టమర్‌ : వెయిటర్‌! ఈ తిండి చూస్తుంటే నాకు డోకు వస్తోంది. మీ మేనేజర్‌ని పిలువు.
వెయిటర్‌ : సారీ సర్‌! ఆయన ఇంతకుముందే బయట భోం చేయడానికి వెళ్ళారు.

బాల్‌ బీటింగ్‌

రాజారావు : ‘అబ్బాయ్‌! ఈ క్రికెట్‌ బాల్‌ నీదేనా?
వెంకట్‌ : అంకుల్‌! ఈ బాల్‌ మీ కిటికీ అద్దాల్ని పగలగొట్టిందా?
రాజారావు : అదేం జరగలేదు బాబూ.
వెంకట్‌ : ఐతే ఈ బాల్‌ నాదే అంకుల్‌!

కోతి చేష్టలు

సన్ని : కోతి ఎందుకని తల గీరుకుంటుంది?
బన్ని : నాకు తెలీదు ఎందుకని?
సన్ని : ఎందుకంటే ఎక్కడ దురద పెడుతుందో దానికి మాత్రమే తెలుసు గనక!

First Published:  18 April 2015 7:00 AM GMT
Next Story