Telugu Global
Others

న‌వ తెలంగాణ‌కి న‌యా రాస్తా వేద్దాం: క‌లెక్ట‌ర్ల‌తో కేసీఆర్‌

న‌వ తెలంగాణ‌కి న‌యా రాస్తా వేయాల‌ని కేసీఆర్ ప్ర‌భుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా క‌లెక్ట‌ర్ల‌తో జ‌రిగిన స‌మావేశంలో అనేక ప్ర‌జాహిత నిర్ణ‌యాలు తీసుకుంది. ప్ర‌తి ఇంటికి మంచి నీటి క‌నెక్ష‌న్ ఉండి తీరాల్సిందేన‌ని, తాము ఎన్నిక‌ల్లో ఈ హామీ ఇచ్చామ‌ని ఇది నెర‌వేర్చ‌క‌పోతే మ‌ళ్ళీ ఓట్లు అడ‌గ‌బోమ‌ని చెప్పామ‌ని అందుచేత ఈ విష‌యంలో అధికారులు చ‌ర్య‌లు తీసుకుని ఇంటింటికీ మంచినీటి సౌక‌ర్యం క‌ల్పించాల‌ని కోరారు. ఏదో మాట‌లు చెప్ప‌డం కాకుండా నిధుల కోసం ఎదురు చూడ‌కుండా ఉండేందుకు […]

న‌వ తెలంగాణ‌కి న‌యా రాస్తా వేద్దాం: క‌లెక్ట‌ర్ల‌తో కేసీఆర్‌
X
న‌వ తెలంగాణ‌కి న‌యా రాస్తా వేయాల‌ని కేసీఆర్ ప్ర‌భుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా క‌లెక్ట‌ర్ల‌తో జ‌రిగిన స‌మావేశంలో అనేక ప్ర‌జాహిత నిర్ణ‌యాలు తీసుకుంది. ప్ర‌తి ఇంటికి మంచి నీటి క‌నెక్ష‌న్ ఉండి తీరాల్సిందేన‌ని, తాము ఎన్నిక‌ల్లో ఈ హామీ ఇచ్చామ‌ని ఇది నెర‌వేర్చ‌క‌పోతే మ‌ళ్ళీ ఓట్లు అడ‌గ‌బోమ‌ని చెప్పామ‌ని అందుచేత ఈ విష‌యంలో అధికారులు చ‌ర్య‌లు తీసుకుని ఇంటింటికీ మంచినీటి సౌక‌ర్యం క‌ల్పించాల‌ని కోరారు. ఏదో మాట‌లు చెప్ప‌డం కాకుండా నిధుల కోసం ఎదురు చూడ‌కుండా ఉండేందుకు ప్ర‌తి జిల్లా క‌లెక్ట‌ర్‌కు రూ. 10 కోట్ల నిధులను ఇస్తామ‌ని, వీటిని అత్య‌వ‌స‌ర నిధిగా త‌మ వ‌ద్ద ఉంచుకుని ఖ‌ర్చు చేయ‌వ‌చ్చ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ చెప్పారు. పేద‌రిక నిర్మూల‌నే త‌మ ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని, ప‌థ‌కాలు బ‌డుగు, బ‌ల‌హీన‌వ‌ర్గాల‌కు చేర్చాల్సిన బాధ్య‌త అధికారుల‌దేన‌ని, ప్ర‌భుత్వం, అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌ని చేయ‌క‌పోతే తాము ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌లేమ‌ని అయ‌న అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా అసైన్డ్ భూములు అన్యాక్రాంత‌మై పోయాయ‌ని, ఇలా చేతులు మారిన భూముల‌ను చెర విడిపించ‌డానికి అధికారులు సిద్ధం కావాల‌ని కేసీఆర్ ఆదేశించారు. అలాగే చిన్న‌చిన్న క‌మ‌తాల‌తో సేద్యం చేయ‌డంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల కోసం త్వ‌ర‌లో క‌మ‌తాల ఏకీక‌ర‌ణ చ‌ట్టం తీసుకురానున్న‌ట్టు సీఎం ప్ర‌క‌టించారు. ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యంతో అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించాల‌ని కోరారు. ప్ర‌భుత్వం, ప్ర‌జ‌లు వేర‌న్న భావ‌న రాకుండా జాగ్ర‌త్త ప‌డాల్సింది అధికారులేన‌ని కేసీఆర్ అన్నారు. మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కు సంబంధించి హైద‌రాబాద్‌లో మాదిరిగానే జిల్లాల్లో కూడా షీ-టీమ్స్ వేయాల‌ని ఆయ‌న సూచించారు
First Published:  18 April 2015 8:21 AM GMT
Next Story