బచ్చన్ కుటుంబంతోనే నెక్ట్స్ సినిమా?

 హిట్స్ ఉన్నప్పుడు వాడుకోవడం, లేనప్పుడు పక్కనపెట్టడం ఇండస్ట్రీలో కామన్. బచ్చన్ ఫ్యామిలీ కూడా ఇన్నాళ్లు అదే చేసింది. విజయాలతో దూసుకుపోతున్న టైమ్ లో మణిరత్నం, రామ్ గోపాల్ వర్మ వంటి దర్శకులతో సినిమాలు చేసింది. ఫ్లాపులు వచ్చిన టైమ్ లో వాళ్లను అస్సలు పట్టించుకోలేదు. ఇప్పుడు ఓకే బంగారంతో హిట్ కొట్టిన మణిరత్నంకు మరోసారి అవకాశమిచ్చే ఆలోచనలో ఉంది బచ్చన్ ఫ్యామిలీ. 
 ఓకే బంగారం సినిమాతో ఓకే అనిపించుకున్నాడు మణిరత్నం. తన తర్వాతి ప్రయత్నంగా బాలీవుడ్ లో ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటికే బచ్చన్ ఫ్యామిలీ నుంచి మణిరత్నంకు ఆఫర్ వచ్చింది. గతంలో రావన్ సినిమా ఫ్లాప్ అయినప్పుడు పక్కనపెట్టిన ఆ ఫ్యామిలీనే ఇప్పుడు మణిరత్నంను పిలిచి మరీ సినిమా చేద్దామని అడిగిందట. ఈ విషయాన్ని నేరుగా చెప్పకపోయినప్పటికీ.. త్వరలోనే హిందీలో ఓ బిగ్ స్టార్ తో సినిమా చేస్తానని ప్రకటించాడు మణిరత్నం. హిట్స్ లేక అల్లాడిపోతున్న అభిషేక్ బచ్చన్ తో మణిరత్నం సినిమా చేసే అవకాశముంది. ఇదే సినిమాలో ఐశ్వర్యరాయ్, అమితాబ్ బచ్చన్ కూడా నటించే ఛాన్స్ ఉంది.