కిక్ రావాలంటే రీషూట్ చేయాల్సిందే

కిక్-2 సినిమా షూటింగ్ పూర్తిచేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు ఆడియో రిలీజ్ కు సిద్ధమౌతున్నారు. ఇలా అన్నీ శరవేగంగా జరుగుతున్నాయనుకుంటున్న టైమ్ లో మరోసారి సెట్స్ పైకి వెళ్లింది కిక్-2 సినిమా. అవును.. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్ని ఇప్పుడు రీషూట్ చేస్తున్నారు. 
కిక్-2 సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టాడు మాస్ రాజా రవితేజ. కేవలం షూటింగ్ చేసి పనికానిచ్చేయకుండా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో కూడా పాలుపంచుకంటున్నాడు. ఇందులో భాగంగా ఎడిటింగ్ దశలో కొన్ని సన్నివేశాలు రవితేజకు నచ్చలేదు. దీంతో వాటిని మళ్లీ షూట్ చేయాలని నిర్ణయించారు. ఇలా రీ-షూట్ చేయడం నిర్మాతకు కాస్త ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే అయినప్పటికీ, సినిమా క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీపడకూడదనే ఉద్దేశంతో మరోసారి షూటింగ్ ప్రారంభించారు. వీలైనంత తొందరగా రీషూట్ పూర్తిచేసి, సినిమాను వచ్చే నెలలో విడుదల చేయాలనుకుంటున్నారు. కిక్-2 సినిమాకు హీరో కల్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకుడు.