పెళ్లి పెట్టుకొని స్పీడు పెంచింది

ఓ వైపు వెడ్డింగ్ డేట్ తరుముకొస్తుంటే.. మరోవైపు సినిమాల సంఖ్య పెంచుకుంటూ పోతోంది చెన్నై బ్యూటి త్రిష. ఎవరైనా పెళ్లి ఫిక్స్ చేసుకున్న తర్వాత వీలైనంతగా సినిమాలు తగ్గించుకుంటారు. కాబోయే భర్తతో కాస్త టైం స్పెండ్ చేయాలని భావిస్తారు. కానీ త్రిష మాత్రం పెళ్లి రోజు దగ్గరపడుతున్న కొద్దీ మరిన్ని సినిమాలకు కాల్షీట్లు కేటాయిస్తోంది. ఇంకాస్త ఎక్కువ టైమ్ సెట్స్ లో గడుపుతోంది. ఇప్పటికే లయన్ సినిమా షూటింగ్ పూర్తిచేసిన ఈ ముద్దుగుమ్మ త్వరలోనే మరో రెండు తమిళ సినిమాలకు ఓకే చెప్పే ఆలోచనలో ఉంది. అందులో ఒకటి ఏకంగా కమల్ హాసన్ మూవీ కావడం విశేషం. కమన్ హాసన్ నయా మూవీలో అత్యంత కీలకమైన పాత్ర కోసం త్రిషను సంప్రదించారు. కథ, క్యారెక్టర్ నచ్చిన త్రిష వెంటనే ఆ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పింది.
కమల్ హాసన్ సినిమాలంటే షూటింగ్ ఎడతెగకుండా సాగుతూనే ఉంటుంది. ఎప్పుడు షూటింగ్ కంప్లీట్ అవుతుందో ఎవరూ చెప్పలేరు. సకాలంలో షూటింగ్ పూర్తిచేసుకున్న సినిమాలు వేళ్లపై లెక్కపెట్టొచ్చు. అలాంటి కమల్ హాసన్ మూవీలో నటించేందుకు త్రిష ఓకే చెప్పడం కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. బహుశా పెళ్లి తర్వాత కూడా కమల్ హాసన్ సినిమాను త్రిష కంటిన్యూ చేసే అవకాశాలున్నాయి.