క్లీన్ యు సర్టిఫికేట్ తో దోచేయ్

Dochey U Certificate
నాగచైతన్య-కృతి సనోన్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా దోచేయ్. ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. సినిమా మొత్తం చూసిన సెన్సార్ బోర్డు దోచేయ్ కు క్లీన్ యు సర్టిఫికేట్ మంజూరు చేసింది. ఎలాంటి కట్స్ ప్రతిపాదించలేదు. దీంతో దోచేయ్ మూవీ విడుదలకు మార్గం సుగమమైంది. సినిమాను ఈనెల 24న విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. స్వామిరారా హిట్ తర్వాత దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కించిన సినిమా ఇది. సన్నీ సంగీత దర్శకత్వంలో కంపోజ్ అయిన పాటల్ని ఇప్పటికే మార్కెట్లోకి విడుదలచేశారు. 3 పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
 దోచేయ్ సినిమా టోటల్ టీం మొత్తానికి కీలకంగా మారింది. ఈ ఏడాది నాగచైతన్యకు ఇదే మొదటి సినిమా. దోచేయ్ హిట్టయితే అక్కినేని హీరోకు మరింత ఉత్సాహం వస్తుంది. అటు వన్-నేనొక్కడినే సినిమాతో ఫ్లాప్ అందుకున్న కృతి సనోన్.. దోచేయ్ తో హిట్ కొట్టాలని భావిస్తోంది. మరోవైపు తన రెండో సినిమాతో కూడా మరో సక్సెస్ అందుకోవాలని దర్శకుడు సుధీర్ వర్మ ఉవ్విళ్లూరుతున్నాడు. హిట్ దర్శకులంతా తమ రెండో సినిమాకి ఫ్లాపులు ఇచ్చిన నేపథ్యంలో సెకెండ్ మూవీ సిండ్రోమ్ ను అధిగమించడానికి ప్రయత్నిస్తున్నాడు. మరోవైపు సంగీత దర్శకుడు సన్నీ కూడా దోచేయ్ తో స్టార్ డమ్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నాడు.