బాహుబలి గెటప్ తోనే సుజిత్ సినిమా కూడా

రన్ రాజా రన్ తో ఎవరూ ఊహించని విజయాన్నందుకున్నాడు దర్శకుడు సుజిత్. ఇప్పుడు ఏకంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నే డైరక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై త్వరలోనే సెట్స్ పైకి రాబోతోంది ఈ సినిమా. సుజిత్ కోసం ఇప్పటికే ఓ ఆఫీస్ కూడా కేటాయించింది యూవీ బ్యానర్. అన్నీ బాగున్నాయ్ కానీ బాహుబలి సినిమాతో చిక్కొచ్చి పడింది సుజిత్ కు. ఎందుకంటే.. రాజమౌళి మూవీ కోసం బాడీతో పాటు గడ్డ-మీసం బాగా పెంచేశాడు ప్రభాస్. సుజిత్ కోసం వాటిని తీసేద్దామంటే బాహుబలి పార్ట్-2 షూటింగ్ ఉండనే ఉంది. అలా అని సుజిత్ సినిమాని పోస్ట్ పోన్ చేసే పరిస్థితి కనిపించడం లేదు. దీనికి ఓ మార్గాన్ని కనిబెట్టాడు దర్శకుడు. బాహుబలి గెటప్ తోనే తన సినిమా షూటింగ్ కూడా కొనసాగించాలని భావిస్తున్నాడు. దీనికి తగ్గట్టు కథలో కొన్ని మార్పులు కూడా చేశాడు. సో.. త్వరలోనే బాహుబలి గెటప్ తో సుజిత్ సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు ప్రభాస్. సేమ్ టైం, బాహుబలి పార్ట్-2 షూటింగ్ ను కూడా కొనసాగిస్తాడు.