Telugu Global
NEWS

చంద్రబాబు మ‌న‌వ‌డికి బుల్లెట్ ఫ్రూఫ్ కారు!

వ‌డ్డించేవాడు మ‌నోడ‌యితే ఎక్క‌డ కూర్చుంటే ఏంటి… అన్న‌ట్టుది నారా వారి వ్య‌వ‌హారం! ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడి ముద్దుల మ‌న‌వ‌డికి కూడా ఇపుడు బుల్లెట్ ఫ్రూఫ్ కారు వ‌చ్చేసింది. లోకేష్‌, బ్రాహ్మ‌ణి దంప‌తుల‌కు ఇటీవ‌ల ఓ కుమారుడు పుట్టిన విష‌యం తెలిసిందే క‌దా! ఈ బుడ్డోడు ఎమ్మ‌ల్యే నంద‌మూరి బాల‌కృష్ణ ఇంట్లో ఉంటున్నాడు. ఇప్ప‌టికే ఈ కుర్రాడికి న‌లుగురు కానిస్టేబుళ్ళ‌తో ప‌క్కా ర‌క్ష‌ణ ఏర్పాటు చేశారు. ఇపుడు బుల్లెట్ ఫ్రూఫ్ కారును అందుబాటులోకి తెచ్చారు. ఎందుకంటే ఈ బుడ్డోడు […]

చంద్రబాబు మ‌న‌వ‌డికి బుల్లెట్ ఫ్రూఫ్ కారు!
X
వ‌డ్డించేవాడు మ‌నోడ‌యితే ఎక్క‌డ కూర్చుంటే ఏంటి… అన్న‌ట్టుది నారా వారి వ్య‌వ‌హారం! ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడి ముద్దుల మ‌న‌వ‌డికి కూడా ఇపుడు బుల్లెట్ ఫ్రూఫ్ కారు వ‌చ్చేసింది. లోకేష్‌, బ్రాహ్మ‌ణి దంప‌తుల‌కు ఇటీవ‌ల ఓ కుమారుడు పుట్టిన విష‌యం తెలిసిందే క‌దా! ఈ బుడ్డోడు ఎమ్మ‌ల్యే నంద‌మూరి బాల‌కృష్ణ ఇంట్లో ఉంటున్నాడు. ఇప్ప‌టికే ఈ కుర్రాడికి న‌లుగురు కానిస్టేబుళ్ళ‌తో ప‌క్కా ర‌క్ష‌ణ ఏర్పాటు చేశారు. ఇపుడు బుల్లెట్ ఫ్రూఫ్ కారును అందుబాటులోకి తెచ్చారు. ఎందుకంటే ఈ బుడ్డోడు అటు చంద్ర‌బాబు ఇంటికి, ఇటు బాల‌కృష్ణ ఇంటికి రాక‌పోక‌లు సాగించేట‌ప్పుడు ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా ఉండేందుకేన‌ట‌!. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు తాత చంద్ర‌బాబు వినియోగించిన స్కార్పియో బుల్లెట్ ఫ్రూఫ్ కారు ఇపుడు నారా వారి వార‌సుడికి అందుబాటు పెట్టారు. అదండీ జాత‌క‌మంటే!
First Published:  20 April 2015 2:00 AM GMT
Next Story