Telugu Global
Cinema & Entertainment

ఇవన్నీ ఏకాకి జీవితాలేనా?

సినిమారంగం ఎంత గ్లామర్‌తో మెరిపిస్తుందో, అంత కర్కశంగానూ ప్రవర్తిస్తుంది. సక్సెస్‌లో ఉన్నవారికే ఎర్ర తివాచీలు, పట్టాభిషేకాలు, గౌరవాలు. లేకపోతే కనీసం కాకి జాతి లక్షణం కూడా చూపించరు. ఒక కాకి చచ్చిపోతే, తోటి కాకులు గుంపుగా గుమికూడటం ఎన్నోసార్లు చూసి ఉంటాం.నిన్న మరణించిన సంగీత దర్శకుడు శ్రీ అంత్యక్రియలని చూస్తే ఇదెంత నిజమో తెలుస్తుంది. ఆయన ప్రముఖ సంగీతదర్శకుడు చక్రవర్తి కుమారుడు. తనంతట తాను మరిచిపోలేని పాటలందించిన సంగీతదర్శకుడు. కాని ఆయన మృతి పట్ల చిత్రపరిశ్రమ ప్రతిస్పందన […]

music director sri
X

సినిమారంగం ఎంత గ్లామర్‌తో మెరిపిస్తుందో, అంత కర్కశంగానూ ప్రవర్తిస్తుంది. సక్సెస్‌లో ఉన్నవారికే ఎర్ర తివాచీలు, పట్టాభిషేకాలు, గౌరవాలు. లేకపోతే కనీసం కాకి జాతి లక్షణం కూడా చూపించరు. ఒక కాకి చచ్చిపోతే, తోటి కాకులు గుంపుగా గుమికూడటం ఎన్నోసార్లు చూసి ఉంటాం.నిన్న మరణించిన సంగీత దర్శకుడు శ్రీ అంత్యక్రియలని చూస్తే ఇదెంత నిజమో తెలుస్తుంది. ఆయన ప్రముఖ సంగీతదర్శకుడు చక్రవర్తి కుమారుడు. తనంతట తాను మరిచిపోలేని పాటలందించిన సంగీతదర్శకుడు. కాని ఆయన మృతి పట్ల చిత్రపరిశ్రమ ప్రతిస్పందన చూస్తే – సినిమారంగం అసలు రంగు ఇదా అన్పిస్తోంది. కె.రాఘవేంద్రరావు 100 సినిమాల్లో దాదాపు 40-50 చిత్రాలకు చక్రవర్తే సంగీతం అందించి ఉంటారు. అలాంటి రాఘవేంద్రరావు మర్యాద పూర్వకంగానైనా శ్రీకి శ్రద్ధాంజలి ఘటించలేదు.

శ్రీతో పనిచేసిన ప్రముఖ దర్శకులు రావమ్‌గోపాల్‌వర్మ కాని, కృష్ణవంశీ కాని – ఏలేటి చంద్రశేఖర్‌ కాని, కనీసం తొంగి చూడలేదు. మరో సంగీత దర్శకుడు ఆర్‌.పి పట్నాయక్‌ టీవి ఛానెల్స్‌లో మాట్లాడుతూ శ్రీ ఇంటి చిరునామా చెబుతూ – శ్రద్ధాంజలి ఘటించమని ఆహ్వానించడం చూస్తే బాధగా అన్పించింది. మురళీమోహన్‌, తమ్మారెడ్డి భరద్వాజ్‌, గుణ్ణం గంగరాజు, కె.సి. శేఖర్‌ బాబు లాంటి కొద్దిమంది తప్పితే, ఇంకెవరూ హాజరు కాలేదు. అసలా మాటకొస్తే. కొన్ని నెలల క్రితం ప్రసిద్ధ నిర్మాత వి.బి. రాజేంద్ర ప్రసాద్‌ కన్ను మూసినప్పుడు – ఆయనకి సినిమా పరిశ్రమ శ్రద్ధాంజలి అర్పించనే లేదు.తెలుగువారు మర్చిపోలేని మ్యూజికల్‌ హిట్‌ సక్సెస్‌ఫుల్‌ సినిమాలు నిర్మించినాయన. తమిళ, హిందీ భాషల్లో విజయ పతాకం ఎగరేశాడయన.

80 ఏళ్ళ తెలుగు సినిమా చరిత్రలో తనకోసం పనిచేసిన వారికోసం సినిమా (పిచ్చిమారాజు) నిర్మించి, ఆ లాభాలు వారికి పంచి పెట్టిన ఏకైక నిర్మాత వి.బి. రాజేంద్ర ప్రసాద్‌. ఓ అక్కినేని, ఓ రామానాయుడు మృతికి చూపిన గౌరవం, అంజలి రాజేంద్రప్రసాద్‌కి దక్కలేదు. బహుశా జగపతిబాబు గారు, నాగార్జున, వెంకటేష్‌ల్లాంటి సక్సెస్‌ ఫుల్‌ బిగ్‌ హీరో కాకపోవడమే కారణమా ? ఇదేనా తెలుగు సినిమా రంగం తన కళాకారులను, మహానుభావులను గౌరవించుకునే తీరు? సంస్మరించుకునే విధానం?

First Published:  20 April 2015 3:54 AM GMT
Next Story