మే 24న ఆంధ్రప్రదేశ్‌ ఎంసెట్‌ ప్రవేశపరీక్ష

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్‌ ప్రవేశ పరీక్ష మే 24న జరుగుతుందని ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ త్వరలో 1300 మంది డాక్టర్లు, నాలుగువేల నర్సుల పోస్టులు భర్తీ చేయనున్నట్లు చెప్పారు. స్విమ్స్‌ ఆస్పత్రి డైరెర్టర్‌ మార్పుపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. రూ. 371 కోట్ల నాబార్డు నిధులతో ప్రభుత్వ ఆస్పత్రులకు మరమ్మతు పనులు చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు.