Telugu Global
Others

హైకోర్టు గుమ్మ‌మెక్కిన ఏపీఓఏ అధ్య‌క్ష వ్య‌వ‌హారం!

హైద‌రాబాద్‌:: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఒలింపిక్స్ అసోసియేష‌న్ (ఏపీఓఏ) అధ్య‌క్ష వ్య‌వ‌హారం హైకోర్టు గుమ్మ‌మెక్కింది. దీనిపై ప్ర‌ధాన న్యాయ‌మూర్తి స్పందిస్తూ ఈ అంశాన్ని సింగిల్ జ‌డ్జి కోర్టు తేల్చాల‌ని ఆదేశించారు. అధ్య‌క్షుల‌మ‌ని చెప్పుకుంటున్న సీ.ఎం.ర‌మేష్‌, గ‌ల్లా జ‌య‌దేవ్ వ‌ర్గాలు రెండూ త‌మ‌దే నిజ‌మైన అసోసియేష‌న్ అని వాదిస్తున్నారు. ఈ అంశాన్ని విన్న ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఏది నిజ‌మైన సంఘ‌మో 72 గంట‌ల్లో తేల్చాల‌ని ఆదేశించారు. ఎవ‌రిది నిజ‌మైన సంఘ‌మో గుర్తించి స‌ర్టిఫికెట్ ఇవ్వాల్సిందిగా ఇండియ‌న్ ఒలింపిక్ అసోసియేష‌న్‌ను ప్ర‌ధాన న్యాయ‌మూర్తి […]

హైకోర్టు గుమ్మ‌మెక్కిన ఏపీఓఏ అధ్య‌క్ష వ్య‌వ‌హారం!
X
హైద‌రాబాద్‌:: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఒలింపిక్స్ అసోసియేష‌న్ (ఏపీఓఏ) అధ్య‌క్ష వ్య‌వ‌హారం హైకోర్టు గుమ్మ‌మెక్కింది. దీనిపై ప్ర‌ధాన న్యాయ‌మూర్తి స్పందిస్తూ ఈ అంశాన్ని సింగిల్ జ‌డ్జి కోర్టు తేల్చాల‌ని ఆదేశించారు. అధ్య‌క్షుల‌మ‌ని చెప్పుకుంటున్న సీ.ఎం.ర‌మేష్‌, గ‌ల్లా జ‌య‌దేవ్ వ‌ర్గాలు రెండూ త‌మ‌దే నిజ‌మైన అసోసియేష‌న్ అని వాదిస్తున్నారు. ఈ అంశాన్ని విన్న ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఏది నిజ‌మైన సంఘ‌మో 72 గంట‌ల్లో తేల్చాల‌ని ఆదేశించారు. ఎవ‌రిది నిజ‌మైన సంఘ‌మో గుర్తించి స‌ర్టిఫికెట్ ఇవ్వాల్సిందిగా ఇండియ‌న్ ఒలింపిక్ అసోసియేష‌న్‌ను ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఆదేశించారు. అప్ప‌టివ‌ర‌కు సింగ‌ల్ జ‌డ్జి బెంచ్ తీర్పును నిలిపి ఉంచాల‌ని సూచించింది. సింగిల్ జడ్జి తీర్పు వ‌చ్చే వ‌ర‌కు ఇరువ‌ర్గాలు వేచి ఉండాల‌ని న్యాయ‌మూర్తి ఆదేశించారు. ఇంత‌కుముందు జ‌య‌దేవ్ ఎన్నిక‌పై హైకోర్టు ఇచ్చిన స్టేను కూడా తొల‌గించారు. త‌దుప‌రి ఆదేశాలు ఇచ్చే వ‌ర‌కు జ‌య‌దేవే ఏపీ ఒలింపిక్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా కొన‌సాగుతార‌ని ఆయ‌న తీర్పులో పేర్కొన్నారు. జ‌య‌దేవ్‌కు దీంతో కొంత ఊర‌ట ల‌భించింది. కేసును జూన్ మొద‌టి వారానికి వాయిదా వేసింది.-పీఆర్‌
First Published:  21 April 2015 12:54 AM GMT
Next Story