Telugu Global
Others

ముంబయిలో విశాఖ జల ప్రవేశం

పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన అత్యాధునిక యుద్ధనౌక ఒకటి ముంబయి తీరంలో జల ప్రవేశం చేసింది. దీనికి మరో ప్రత్యేకత కూడా ఉంది. నౌకకు విశాఖపట్టణం అనే పేరు పెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక కీలక నగరంగా ఎదుగుతున్న విశాఖ పేరుతో నిర్మితమైన యుద్ధనౌక ముంబయిలో జల ప్రవేశం చేయడం విశేషం. ఈ నౌక ద్వారా భారత యుద్ధ సామర్థ్యం మరింత పెరిగిందని రక్షణ శాఖ వర్గాలు చెప్పాయి. ఇప్పుడు జల ప్రవేశం చేసినప్పటికీ 2018లో మాత్రమే దీన్ని […]

ముంబయిలో విశాఖ జల ప్రవేశం
X

పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన అత్యాధునిక యుద్ధనౌక ఒకటి ముంబయి తీరంలో జల ప్రవేశం చేసింది. దీనికి మరో ప్రత్యేకత కూడా ఉంది. నౌకకు విశాఖపట్టణం అనే పేరు పెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక కీలక నగరంగా ఎదుగుతున్న విశాఖ పేరుతో నిర్మితమైన యుద్ధనౌక ముంబయిలో జల ప్రవేశం చేయడం విశేషం. ఈ నౌక ద్వారా భారత యుద్ధ సామర్థ్యం మరింత పెరిగిందని రక్షణ శాఖ వర్గాలు చెప్పాయి. ఇప్పుడు జల ప్రవేశం చేసినప్పటికీ 2018లో మాత్రమే దీన్ని నౌకాదళంలో చేరుస్తారు. అప్పుడు దీని పేరు ”ఐఎన్‌ఎస్‌ విశాఖపట్టణం”గా మారుతుంది. 3 వేల టన్నుల బరువు, 163 మీటర్ల పొడవున్న ఈ నౌకలో అత్యాధునిక రాడార్‌ వ్యవస్థ ఉంది. శత్రుదేశాల రాడార్లను బోల్తా కొట్టించే స్టెల్ సామర్థ్యం కూడా ఇందులో ఉంది. శత్రుదేశ నౌకాలక్ష్యాలను చాలా దూరం నుంచి ఛేదించే సూపర్‌సోనిక్‌ క్షిపణి వ్యవస్థను విశాఖలో అమరుస్తారు. యుద్ధనౌకకు ఉండాల్సిన అన్ని హంగులను అమర్చి 2018లో నౌకాదళంలో చేరుస్తారు.

First Published:  21 April 2015 11:52 AM GMT
Next Story