Telugu Global
NEWS

నేల‌మ‌ట్ట‌మైన ఆంజ‌నేయ‌స్వామి ఆల‌యం

కృష్ణాజిల్లా అవ‌నిగ‌డ్డ‌లో ఆంజ‌నేయ స్వామి దేవాల‌యం కుప్ప‌కూలిపోయింది. మంగ‌ళ‌వారం నాడు ఇది జ‌ర‌గ‌డం చాలా అరిష్ట‌మ‌ని ప్ర‌జ‌లు భావిస్తున్నారు. ఆల‌యానికి ఆనుకుని ఉన్న కాలువ‌లో ఆంజ‌నేయ‌స్వామి విగ్ర‌హం ప‌డిపోయింది. అవ‌నిగ‌డ్డ బ‌స్ స్టాండ్‌కు సమీపంలో ఉన్న ఈ గుడికి ప్ర‌తి మంగ‌ళ‌వారం భ‌క్తులు విప‌రీతంగా వస్తారు. నిజానికి ఈరోజు మంగ‌ళ‌వారం కావ‌డంతో ఎక్కువ మంది భ‌క్తులు వ‌చ్చే అవ‌కాశం ఉంది. కాని ఉద‌యం చూసే స‌రికే ఆల‌యం మొత్తం నేల‌మ‌ట్ట‌మైపోయింది. దాంతో భ‌క్తులు చాలా ఆందోళ‌న చెందుతున్నారు. […]

కృష్ణాజిల్లా అవ‌నిగ‌డ్డ‌లో ఆంజ‌నేయ స్వామి దేవాల‌యం కుప్ప‌కూలిపోయింది. మంగ‌ళ‌వారం నాడు ఇది జ‌ర‌గ‌డం చాలా అరిష్ట‌మ‌ని ప్ర‌జ‌లు భావిస్తున్నారు. ఆల‌యానికి ఆనుకుని ఉన్న కాలువ‌లో ఆంజ‌నేయ‌స్వామి విగ్ర‌హం ప‌డిపోయింది. అవ‌నిగ‌డ్డ బ‌స్ స్టాండ్‌కు సమీపంలో ఉన్న ఈ గుడికి ప్ర‌తి మంగ‌ళ‌వారం భ‌క్తులు విప‌రీతంగా వస్తారు. నిజానికి ఈరోజు మంగ‌ళ‌వారం కావ‌డంతో ఎక్కువ మంది భ‌క్తులు వ‌చ్చే అవ‌కాశం ఉంది. కాని ఉద‌యం చూసే స‌రికే ఆల‌యం మొత్తం నేల‌మ‌ట్ట‌మైపోయింది. దాంతో భ‌క్తులు చాలా ఆందోళ‌న చెందుతున్నారు. ఇరిగేష‌న్ అధికారుల నిర్ల‌క్ష్యం కార‌ణంగానే ఆల‌యానికి ఈ ప‌రిస్థితి సంభ‌వించింద‌ని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప‌క్క‌నే ఆల‌యం ఉన్న‌ప్పుడు రిటైనింగ్ వాల్ నిర్మాణంలో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌న‌బ‌ర‌చాల్సిన ఇరిగేష‌న్ అధికారులు, కాంట్రాక్ట‌ర్లు ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రించార‌ని… ఫ‌లితంగానే ఆల‌యం కాలువ‌లోకి చొచ్చుకుపోయి కూలిపోయింద‌ని భ‌క్తులు చెబుతున్నారు.
First Published:  21 April 2015 2:05 AM GMT
Next Story