డైరక్టర్ తో పాటు టైటిల్ ఫిక్స్

ఒక్కసారి కమిటైతే కమల్ తనమాట తానే వినడు. ఉత్తమ్ విలన్ సినిమాని పూర్తిచేసిన లోకనాయకుడు అంతే వేగంతో మరో కొత్త సినిమా కథ, స్క్రీన్ ప్లే కూడా పూర్తిచేశాడు. జేమ్స్ బాండ్ తరహా కథతో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో త్రిషను హీరోయిన్ గా ఫైనలైజ్ చేశారు. ఇప్పుడు దర్శకుడుతో పాటు సినిమా టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. తన దగ్గర అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేసిన రాజేష్ అనే కుర్రాడికి దర్శకుడిగా ప్రమోషన్ ఇచ్చాడు కమల్. టోటల్ బౌండెడ్ స్క్రిప్ట్ ను రాజేష్ కు అందజేశాడు. మరోవైపు సినిమాకు ఒరే ఇరవు అనే టైటిల్ ను కూడా తనే ఫిక్స్ చేశాడు. ఫారిన్ టెక్నీషియన్లతో సంప్రదింపులు పూర్తయితే.. వచ్చే నెల నుంచి ఈ కొత్త సినిమా సెట్స్ పైకి వస్తుంది. జేమ్స్ బాండ్ తరహా యాక్షన్ కథ కాబట్టి.. యాక్షన్ సన్నివేశాల కోసం శరీరాన్ని మలుచుకునేందుకు ఇప్పటికే జిమ్ బాట పట్టాడు కమల్ హాసన్.