బ‌న్నీ తో బోయ‌పాటి సినిమా ఎప్పుడు ?

స‌న్ ఆఫ్ స‌త్య‌మూర్తి రిజ‌ల్ట్ తారుమారు కావ‌డంతో అల్లు అర్జున్ – బోయ‌పాటి ప్రాజెక్ట్ మీద సందేహాలు నెల‌కొన్నాయి, బోయ‌పాటి స్ర్కిప్ట్ బ‌న్నీకి, అల్లు అర‌వింద్ కి న‌చ్చ‌లేద‌ని, సెకండాఫ్ మార్పులు , చేర్పులు చెప్పార‌నే వార్త‌లు బ‌య‌టికొచ్చాయి. అయితే వెంట‌నే సినిమా చేయ‌డానికి మ‌రో ద‌ర్శ‌కుడు రెడీగా

లేక‌పోవ‌డంతో బోయ‌పాటికే ప‌చ్చ‌జెండా ఊపారు. మే లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించ‌డానికి స‌న్న‌హాలు చేస్తున్నారు. గీతాఆర్ట్స్ బేన‌ర్ పై ఈ సినిమా నిర్మిస్తున్నారు.