రణబీర్ కంటే రవీనా కోసం వెయిటింగ్

రవీనా టాండన్.. ఈ ముద్దుగుమ్మ పేరు బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా పాపులరే. బాలయ్యతో రవీనా చేసిన సినిమాని, ఆ స్టెప్పుల్ని తెలుగు ఆడియన్స్ మరిచిపోలేరు. చాన్నాళ్ల గ్యాప్ తర్వాత ఈ సీనియర్ హీరోయిన్ మళ్లీ ముఖానికి రంగేసుకుంది. వెండితెరపై రీఎంట్రీ ఇస్తోంది. నిజానికి ఆ సినిమాలో హీరోయిన్ రవీనా కాదు. రణబీర్ కపూర్, అనుష్క శర్మ హీరోహీరోయిన్లుగా నటించారు. కానీ రణబీర్ కపూర్ కంటే రవీనా టాండన్ ఎంట్రీ కోసమే ఆడియన్స్ ఎక్కువగా ఎదురుచూస్తున్నారు. ఆ సినిమానే బాంబే వాల్వెట్. అనురాగ్ కశ్వప్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమాలో సీనియర్ జాజ్ సింగర్ గా రవీనా టాండన్ కనిపించనుంది. ఈ సినిమాతో రీఎంట్రీ బ్రహ్మాండంగా ఇవ్వాలని భావిస్తోంది రవీనా టాండన్. మరోవైపు మధుబాల తరహాలో తెలుగులో కూడా సినిమాలు చేసే ఆలోచనలో ఉంది.