భర్త పై భార్య దాడి

అనంతపూర్ జిల్లా తలుపూరు మండల పరిధిలోని తలుపూరు గ్రామంలో ఓ మహిళ తన భర్తపై దాడి చేసిన ఘటన వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం… తలుపూరుకు చెందిన గొల్ల వెంకటలక్ష్మి తన భర్త వెంకటేష్ పై కత్తి పీటతో దాడి చేసి గాయ పరిచింది. తీవ్రంగా గాయపడిన వెంకటేష్ ను ఆసుపత్రి లో చేర్చారు. మూడు రోజుల చికిత్స అనంతరం మంగళవారం అతను గ్రామానికి వచ్చాడు. భర్తపై కోపంగా ఉన్న వెంకట లక్ష్మి అతనిపై మరో సారి దాడి చేసి కొట్టింది. అయితే చుట్టుపక్కల వారు అడ్డుకుని అమీనువారించబోగా అక్కడి నుంచి పారిపోయింది. భర్తపై దాడి చేసి గాయపరిచిన వెంకట లక్ష్మిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. భార్యాభర్తల మధ్య గత కొంత కాలంగా బాగా గొడవలు జరుగుతున్నాట్లు ఇరుగు పొరుగు వారు చెబుతున్నారు. ఇదిలా ఉండగా భర్తపై దాడి కేసులో నిందితురాలిగా ఉన్న వెంకట లక్ష్మి తనపై తన భర్త హత్యాయత్నం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. గొంతుపై కోసిన గాయాలతో మంగళవారం సాయంత్రం ఆమె ఆసుపత్రిలో చేరిందని సమాచారం.