బాల‌య్య హీరోయిన్ కు చురకలు వేసింది..!

ర‌క్త చ‌రిత్ర‌, ధోని, లెజెండ్  చిత్రాలు చేసిన రాధిక ఆప్టే  తాజాగా బాల‌య్య తో  ల‌య‌న్ చిత్రంలో న‌టిస్తుంది.  అయితే ఆ మ‌ధ్య టాలీవుడ్ గురించి  ఈ హాట్ బ్యూటీ  ఒక ఘూటైన కామెంట్ చేసిన విష‌యం తెలిసిందే. టాలీవుడ్ త‌ప్ప త‌న‌కు  మిగిలిన  చోట్ల చాల హాయ‌గా వుంటుంద‌ని చెప్పింది. ఇక్క‌డ హీరోయిన్స్ ను స‌రిగా ట్రీట్ చేయ‌రంటూ సైట‌ర్ వేసింది.  అప్ప‌ట్లో  ఈ విషయం ఓ హాట్ టాపిక్.  అయితే ప్ర‌స్తుతం  దోచేయ్ చిత్రం చేస్తున్న కృతి స‌న‌న్ మాత్రం   త‌న‌కు టాలీవుడ్ లో వ‌ర్క్ చేయ‌డం ఎంతో హాయ‌గా ఉంద‌ని మీడియాకు తెలిపింది. గ‌తంలో మ‌హేష్ బాబు స‌ర‌స‌న చేసిన వ‌న్ చిత్రం అప్పుడు గానీ.. ఇప్పుడు దోచేయ్ చిత్ర విషయంలో గాని టాలీవుడ్ వారు త‌నకు ఎంతో  స‌హ‌క‌రించార‌ని  చెప్పింది. ఇది నిజంగా  బాల‌య్య  లెజెండ్ హీరోయిన్ రాధిక ఆప్టేకు ఒక సైట‌ర్ లాంటింద‌ని చ‌ర్చించుకుంటున్నారు ఫిల్మ్ న‌గ‌ర్ జ‌నాలు.