Telugu Global
Cinema & Entertainment

మోడి గారికి మంచు వారి పెళ్లి శుభ‌లేక..!

పాలిటిక్స్ , సినిమా రెండు గ్లామ‌ర్ ఫిల్డ్సే. సినిమా గ్లామ‌ర్ కాస్తా ఎక్కువ అనుకోవ‌చ్చు. అయితే మోడి మాత్రం సినిమా సెలిబ్రిటీల్ని మించిన ఫాలోయింగ్ గెయిన్ చేసిన పొలిటిక‌ల్ సెలిబ్రిటి. సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముందు న‌రేంద్ర మోడి హైద‌ర‌బాద్ స‌భ‌కు వ‌చ్చిన‌ప్పుడు .. మ‌న తెలుగు ఇండ‌స్ట్రీ లో స‌గం మంది స్టార్స్ వెళ్సి అయిను క‌ల‌సి ఫోటొలు దిగి వ‌చ్చారు. ఇక మంచు మోహ‌న్ బాబు గారి కుటుంబం అంత క‌ల‌సి వెళ్లి మోడి గారితో […]

మోడి గారికి మంచు వారి పెళ్లి శుభ‌లేక..!
X

పాలిటిక్స్ , సినిమా రెండు గ్లామ‌ర్ ఫిల్డ్సే. సినిమా గ్లామ‌ర్ కాస్తా ఎక్కువ అనుకోవ‌చ్చు. అయితే మోడి మాత్రం సినిమా సెలిబ్రిటీల్ని మించిన ఫాలోయింగ్ గెయిన్ చేసిన పొలిటిక‌ల్ సెలిబ్రిటి. సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముందు న‌రేంద్ర మోడి హైద‌ర‌బాద్ స‌భ‌కు వ‌చ్చిన‌ప్పుడు .. మ‌న తెలుగు ఇండ‌స్ట్రీ లో స‌గం మంది స్టార్స్ వెళ్సి అయిను క‌ల‌సి ఫోటొలు దిగి వ‌చ్చారు. ఇక మంచు మోహ‌న్ బాబు గారి కుటుంబం అంత క‌ల‌సి వెళ్లి మోడి గారితో గ్రూప్ ఫోటో దిగి వ‌చ్చారు. ఆ పిక్ ను సోష‌ల్ నెట్ వ‌ర్క్ లో మంచు ల‌క్ష్మీ షేర్ చేసిన సంద‌ర్భం ఉంది. క‌ట్ చేస్తే ఎన్నిక‌ల స‌మ‌యంలో మోహాన్ బాబు మోడికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.

ఇదిలా వుంటే న‌రేంద్ర‌మోడి ప్ర‌ధాన మంత్రి అయిన త‌ర‌వాత .. ల‌క్ష్మీ అవ‌కాశం దొరిక‌న‌ప్పుడ‌ల్లా మోడి గారి పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తూనే వున్నారు. ఇక అస‌లు మ్యాట‌రేంటంటే..మంచు మ‌నోజ్ పెళ్లికి ప్ర‌ధానీ మోడి జీ ని ఆహ్వానించారు. మోహాన్ బాబు , ల‌క్ష్మీ, మనోజ్ లు స్వ‌యంగా ఢిల్లీ వెళ్లి ఆయ‌న నివాసంలో క‌ల‌సి పెళ్లి ప‌త్రిక అందించి.. మే 20 న జ‌ర‌గనున్న త‌మ చిన్న‌బ్బాయి మంచు మ‌నోజ్ పెళ్లికి రావాల‌ని ఆహ్వానించి వచ్చారు. మ‌రి మోడి జీ కి టైమ్ కుదిరి నిజంగా పెళ్లికి వ‌స్తే.. అంత‌కు మించిన విశేషం మ‌రొక‌టి ఉండ‌దు. అయితే గుర్తు పెట్టుకుని శుభాకాంక్ష‌లు అయితే తెల‌ప‌డం జ‌ర‌గొచ్చు అని ఊహిస్తున్నారు .
ఇక మంచు మ‌నోజ్ త‌న వ‌దిన వెరోనిక ఫ్రెండ్ తో ప‌రిచ‌యం..ఆ త‌రువాత ప్రేమ‌లో ప‌డ‌టం.. ఇరువైపుల పెద్ద‌లు అంగీక‌రించ‌డం .. ఈ మ‌ధ్య నే నిశ్చితార్దం జ‌ర‌గ‌డం తెలిసిందే.

First Published:  21 April 2015 10:30 PM GMT
Next Story