ప‌వ‌న్ బాబా అవ‌తారం దేనికోసం..!

టాలీవుడ్ లో త‌న స‌మకాలీన హీరోల్లో ఒక విశిష్ట‌మైన  వ్య‌క్త‌త్వం క‌లిగిన హీరో  ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. తెర పై క‌నిపించ‌డానికి  మేక‌ప్ వేసుకుంటాడు కానీ..రియ‌ల్ లైఫ్ లో  ఏవిధ‌మైన మేక‌ప్ లేకుండా..క‌నిపిస్తారు. త‌మిళ్ లో ర‌జనీకాంత్   రియ‌ల్ లైఫ్ లో క‌నిపించేన‌ట్లే.. తెలుగు నాట  ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌నిపిస్తుంటారు. ఇక పాలిటిక్స్..సినిమాల‌తో  మీడియాకు కేంద్ర బిందువుగా మారిన ప‌వ‌ర్ స్టార్.. ప్ర‌స్తుతం ఆయ‌న క‌నిపిస్తున్న లుక్  ప‌లు సందేహాల‌కు తావిస్తుంది.  ఈ మ‌ధ్య  త‌న అభిమాని శ్రీ‌జ కుటుంబ స‌భ్యులు త‌న‌ను క‌ల‌వ‌డానికి వ‌చ్చిన‌ప్పుడు ..ప‌వ‌న్ క‌ళ్యాణ్ వాళ్ల‌తో క‌నిపించిన గ‌డ్డం లుక్ ఇప్పుడు అభిమానుల్లో పెద్ద డిబేట్ అయ్యింది.  
ప‌వ‌న్ ఏదో  బాబా లుక్ లో క‌నిపించ‌డానికే ఇలా గ‌డ్డం పెంచిన‌ట్లు చెప్పుకుంటున్నారు. గ‌బ్బ‌ర్ సింగ్  సీక్వెల్ కు సీరియ‌స్ గా వ‌ర్కువుట్ చేస్తున్న ప‌వ‌న్  ఆ చిత్రంలో బాబ లుక్ కోసం ఇలా పెంచి వుండోచ్చు అనేది  ప‌రిశీల‌కుల మాట‌.  త‌న బాల అభిమాని  శ్రీ‌జా క్యాన్స‌ర్ తో బాధ‌ప‌డుతున‌ర్న‌స‌మ‌యంలో   ఆ పాప ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను చూడాల‌ని వుందని చెప్ప‌గా..  ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌చ్చి  పాప‌ను ప‌రమార్శించి  త్వ‌ర‌గా కోలుకుంటావ‌ని ధైర్యం చెప్పి వెళ్లారు.    పాప నిజంగానే  చాల సివియ‌ర్ స్టేజ్ నుంచి కోలుకుంది.  ఆ సంతోషంతో కుటుంబం అంత  ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను క‌ల‌వ‌డానికి వెళ్లి గా..ప‌వ‌న్ ఒక బాబా రూపంలో వారికి ద‌ర్శ‌నిమిచ్చారు.