Telugu Global
Others

లోక్‌స‌భ‌ను కుదిపేసిన నెట్ న్యూట్రాలిటీ

నెట్ న్యూట్రాలిటీ అంశం బుధ‌వారం లోక్‌స‌భ‌ను కుదిపేసింది. నెట్ న్యూట్రాలిటీకి వ్య‌తిరేకంగా దాదాపు ప‌ది ల‌క్ష‌ల మంది సామాజిక వెబ్‌సైట్ల ద్వారా పోరాటం చేస్తుంటే ప్ర‌భుత్వం చోద్యం చూస్తుంద‌ని కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు, ఎంపీ రాహుల్‌గాంధీ విమ‌ర్శించారు. నెట్ న్యూట్రాలిటీపై చ‌ట్టం తీసుకురావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న అన్నారు. ఇంట‌ర్నెట్ స‌మాన‌వ‌త్వంపై కాంగ్రెస్ పార్టీతో విప‌క్షాలు కూడా గొంతు క‌లిపాయి. ప్ర‌భుత్వం కార్పొరేట్ల‌కు త‌ల‌వంచి ప‌ని చేస్తుంద‌ని, వారి చేతిలో ఇంట‌ర్నెట్ పెట్ట‌డం స‌రికాద‌ని ఆయ‌న అన్నారు. ఉచిత […]

లోక్‌స‌భ‌ను కుదిపేసిన నెట్ న్యూట్రాలిటీ
X
నెట్ న్యూట్రాలిటీ అంశం బుధ‌వారం లోక్‌స‌భ‌ను కుదిపేసింది. నెట్ న్యూట్రాలిటీకి వ్య‌తిరేకంగా దాదాపు ప‌ది ల‌క్ష‌ల మంది సామాజిక వెబ్‌సైట్ల ద్వారా పోరాటం చేస్తుంటే ప్ర‌భుత్వం చోద్యం చూస్తుంద‌ని కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు, ఎంపీ రాహుల్‌గాంధీ విమ‌ర్శించారు. నెట్ న్యూట్రాలిటీపై చ‌ట్టం తీసుకురావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న అన్నారు. ఇంట‌ర్నెట్ స‌మాన‌వ‌త్వంపై కాంగ్రెస్ పార్టీతో విప‌క్షాలు కూడా గొంతు క‌లిపాయి. ప్ర‌భుత్వం కార్పొరేట్ల‌కు త‌ల‌వంచి ప‌ని చేస్తుంద‌ని, వారి చేతిలో ఇంట‌ర్నెట్ పెట్ట‌డం స‌రికాద‌ని ఆయ‌న అన్నారు. ఉచిత ఇంట‌ర్నెట్ సౌక‌ర్యానికి కేంద్రం క‌ట్టుబ‌డి ఉంద‌ని ఆయ‌న తెలిపారు. ప్ర‌భుత్వం కార్పొరేట్ల‌కు త‌ల‌వంచుతుంద‌ని రాహుల్ వాద‌నలో నిజం లేద‌ని, స్పెక్ట్రం వేలం ద్వారా అధిక ఆదాయం పొందిన ఘ‌న‌త త‌మ‌దేన‌ని కేంద్ర మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ అన్నారు.
First Published:  22 April 2015 3:10 AM GMT
Next Story