Telugu Global
Others

న‌ష్టాల బాట వీడిన స్టాక్ మార్కెట్లు

ఐదు రోజులుగా న‌ష్ట‌పోతున్న స్టాక్ మార్కెట్‌లు ఈరోజు ఆ ట్రెండ్ నుంచి బ‌య‌ట‌ప‌డ్డాయి. ఉద‌యం నుంచి ఒడిదుడుకుల మ‌ధ్య కొన‌సాగుతూనే చివ‌రికి సెన్సెక్స్ 214 పాయింట్లు పెరిగి 27,890 ద‌గ్గ‌ర స్థిర‌ప‌డ‌గా, నిఫ్టి 51.95 పాయింట్లు పెరిగి 8429 వ‌ద్ద ముగిసింది. బీఎస్ఈలో స‌న్‌ఫార్మా వంద కోట్ల‌కు పైగా ట‌ర్నోవ‌ర్ సాధించ‌గా ఆ త‌ర్వాత స్థానం 81 కోట్ల‌తో ఎస్‌బ్యాంక్ ఆక్ర‌మించింది. జ‌స్ట్‌డ‌యిల్ షేరు ఈరోజు 11 శాతం పైగా లాభ‌ప‌డి 1196 రూపాయ‌ల వ‌ద్ద ముగిసింది. […]

ఐదు రోజులుగా న‌ష్ట‌పోతున్న స్టాక్ మార్కెట్‌లు ఈరోజు ఆ ట్రెండ్ నుంచి బ‌య‌ట‌ప‌డ్డాయి. ఉద‌యం నుంచి ఒడిదుడుకుల మ‌ధ్య కొన‌సాగుతూనే చివ‌రికి సెన్సెక్స్ 214 పాయింట్లు పెరిగి 27,890 ద‌గ్గ‌ర స్థిర‌ప‌డ‌గా, నిఫ్టి 51.95 పాయింట్లు పెరిగి 8429 వ‌ద్ద ముగిసింది. బీఎస్ఈలో స‌న్‌ఫార్మా వంద కోట్ల‌కు పైగా ట‌ర్నోవ‌ర్ సాధించ‌గా ఆ త‌ర్వాత స్థానం 81 కోట్ల‌తో ఎస్‌బ్యాంక్ ఆక్ర‌మించింది. జ‌స్ట్‌డ‌యిల్ షేరు ఈరోజు 11 శాతం పైగా లాభ‌ప‌డి 1196 రూపాయ‌ల వ‌ద్ద ముగిసింది. ఆ త‌ర్వాత లాభ‌ప‌డిన షేరు గీతాంజ‌లి. ఇది 9 శాతం పైగా లాభ‌ప‌డింది. ఏసీసీ, హిందుస్థాన్ యూనీలివ‌ర్‌లు కూడా లాభ‌ప‌డ్డాయి. విప్రో ఆరు శాతం, గుజ‌రాత్ గ్యాస్ 5.7 శాతం న‌ష్ట‌పోయాయి.
ఒక‌ద‌శ‌లో నిఫ్టీ 8300 పాయింట్ల క‌న్నా దిగువ‌కు ప‌డిపోయింది. ఆ త‌ర్వాత మ‌ళ్ళీ కోలుకుని 8429 వ‌ద్ద‌కు చేరింది. మ‌ధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండున్న‌ర గంట‌ల వ‌ర‌కు దోబూచులాడుతూనే ఉంది. అక్క‌డి నుంచి మ‌ళ్ళీ పుంజుకుని నిఫ్టీ 51.95 పాయింట్లు పెరిగింది. సెన్సెక్స్ కూడా ఇదే ప‌రిస్థితి. ఆరో ట్రేడింగ్ సెష‌న్‌లో కూడా సెన్సెక్స్‌, నిఫ్టీ న‌ష్టాల బాట ప‌డుతుంద‌నే అంద‌రూ భావించారు. చివ‌రి గంట‌లో అంచ‌నాల‌ను త‌ల్ల‌కిందులు చేస్తూ నెమ్మ‌దిగా సూచీలు పైకి ఎగ‌బాకి ఇన్వెస్ట‌ర్ల‌లో ఆశ‌లు చిగురింప‌జేశాయి.-పీఆర్‌
First Published:  22 April 2015 1:20 AM GMT
Next Story