స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి  త్రివిక్ర‌మ్ కు న‌చ్చిందా..?

 స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి విడుద‌ల‌కు ముందు ఏ రేంజ్ లో హైపు వ‌చ్చిందో తెలిసిందే.  అయితే  సినిమా విడుద‌లైన త‌రువాత మిక్స్ డ్ రెస్పాన్స్  అభిమానుల నుంచి వ‌చ్చింది.  విమ‌ర్శ‌కులైతే ఈ సినిమా  త్రివిక్ర‌మ్ సినిమా కాదు అని తేల్చారు. ఎక్క‌డ అయినా మార్క్ పంచ్ లు లేవు.  క‌థ‌లో  ప్రేక్ష‌కుడిని క‌ట్టి పడేసే ఎమోషన్ ను లేదు.   బ‌న్నీ లాంటి  హై వోల్టేజ్  హీరో కు  క‌నీసం ఒక్క స‌న్నివేశ‌మైన బ‌న్నీ ఎన‌ర్జీ ని హైలెట్ చేసే   యాక్ష‌న్ సీన్ లేదు. అత్తారింటికి దారేది చిత్రంలో  అన్ని ర‌సాలు స‌మపాళ్ల‌లో  వేసి .. టైటిల్స్ నుంచి  ఎండ్ టైటిల్స్ వ‌ర‌కు  ప్రేక్ష‌కుల్ని  క‌థ‌లో  ఇన్వాల్వ్ చేసిన త్రివిక్రమ్, స‌న్నాఫ్  స‌త్య‌మూర్తి చిత్రం కోసం అందులో స‌గం కూడా చేయ‌లేక పోవ‌డం కొంత  నిరాశ ప‌రిచే అంశమే. ఈ సినిమా డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ చూసుకునే వుంటారు.  ఎక్క‌డ దెబ్బ కొట్టిందో ఆయనకు పూర్తి క్లారీటి వ‌చ్చే వుంటుంది.  ఇది ఆయ‌న‌కు న‌చ్చిందా అంటే .. సినిమా చేయ‌క ముందు న‌చ్చి ఉండి వ‌చ్చు.. ఇప్పుడు మాత్రం పొర‌పాట్లు.. కధా ప‌రంగా ఎక్క‌డ జ‌రిగాయో అర్ధమయిండొచ్చు .కాని  స్టోరి ఆయనే క్రియేట్ చేసాడు కాబ‌ట్టి న‌చ్చ‌క పోవ‌డం అనేది ఉంటుందా..?
SHARE
Previous articleNithya Menon Stills
Next articleShravya Latest Stills