జాదుగాడు ఎవ‌రికి ఎస‌రు పెడ‌తాడు..!

తెలుగు ఇండ‌స్ట్రీలో యువ హీరోల సంఖ్య రోజురోజికి పెరిగిపోతుంది.  ఎవ‌రికి ఎవ‌రు పోటి కాదు అని పైకి అంటుంటారు . కానీ ఇది నిజంగా వాస్త‌వం కాదు . ఎందుకంటే  చిత్రం సినిమా విడుద‌లైన త‌రువాత‌..ఉద‌య్ కిర‌ణ్ చాల కాలం ల‌వ‌ర్ బోయ్ గా  స‌క్స‌స్ అయ్యాడు. ఉద‌య్ కిర‌ణ్  ని  అదే ఇమేజ్ గెయిన్ చేసిన త‌రుణ్  ఓవ‌ర్ టేక్ చేయ‌లేక పోయాడు. కాస్త లేటుగా వ‌చ్చిన న‌వ‌దీప్.  నితిన్ ఆ ప్లేస్ ను భర్తి చేస్తార‌నుకుంటే.. వాళ్లు కూడా చేయ‌లేక పోయారు. కొత్త బంగారు లోకం తో వ‌రుణ్ సందేశ్ చేస్తాడ‌ని అశించారు . వరుణ్ కూడా ఆ గ్యాప్ నింపలేక పోయారు.
ఇక తాజాగా ‘ఊహాలు గుస గుస‌లాడే’ చిత్రంతో  ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయిన  యువ  హీరో  నాగశౌర్య  వెంట వెంట‌నే    ల‌క్ష్మీ రావే మా ఇంటికి,  దిక్కుల చూడ‌కు రామ‌య్య వంటి ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్స్ తో మెప్పించే ప్ర‌య‌త్నం చేశాడు. ఈ సినిమా ఆడియో విడుద‌ల‌కు అతిథులుగా వ‌చ్చిన  కోన వెంక‌ట్,  క‌ళ్యాణ్ మాలిక్, నందీని రెడ్డి.. అంతా  నాగశౌర్య కు ఈ చిత్రం  మంచి బ్రేక్ ఇస్తుంద‌నే ఆశ వ్య‌క్త ప‌రిచారు. నాగ‌శౌర్య కూడా అదే ధైర్యంతో వున్నాడు.  మార్కెట్ ప‌రంగా కొంత క్రేజ్ పెర‌గాలంటే క‌చ్చితంగా మాస్ చిత్రాలు చేయాల్సిందే.  మాస్  హీరో అనే ఇమేజ్  ఒక ఆయుధం . మ‌రి ఆ ఇమేజ్ ను హీరో ఎంత వ‌ర‌కు గెయిన్ చేస్తాడో . ఇదిలా వుంటే..  త‌న స‌మ‌కాలిన హీరోలు  నానీ,  న‌వ‌దీప్, రాహుల్, వ‌రుణ్ సందేశ్,  ప్రిన్స్ , సాయిధ‌ర‌మ్ తేజ ల‌  ల‌వ‌ర్ బోయ్ చిత్రాల‌కు  నాగ‌శౌర్య చిత్రాలు వంద‌కు వంద శాతం  పోటినే అని చెప్పాలి.