కిక్-2తో బెంగాల్ టైగర్ కు ఎందుకు పోటీ..

రవితేజ మరోసారి స్వింగ్ లోకి వచ్చాడా.. మళ్లీ తన పాత స్టయిల్ లోకి వెళ్లిపోతున్నాడా.. సినిమా రిలీజ్ ల విషయంలో మరోసారి ట్రెండ్ సెట్ చేయడానికి సిద్ధమౌతున్నాడా.. తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. కిక్-2 సినిమా షూటింగ్ పూర్తిచేసిన రవితేజ.. ఇప్పుడు అంతే వేగంతో బెంగాల్ టైగర్ సినిమాను కూడా పరుగులు పెట్టిస్తున్నాడు. కుదిరితే షార్ట్ గ్యాప్ లో రెండు సినిమాల్ని బ్యాక్ టు బ్యాక్ థియేటర్లలోకి దించేద్దామనే ఆలోచనలో ఉన్నట్టున్నాడు మాస్ రాజా.

నిజానికి రవితేజది అంతా జెట్ స్పీడ్. ఒక్కసారి సినిమా కమిటైతే 3 నెలల్లో పూర్తిచేస్తాడు. నాలుగో నెలలో మూవీ థియేటర్లలోకి రావాల్సిందే. అలా ఏడాదికి కనీసం 4-5 సినిమాలు చేస్తుంటాడు రవితేజ. అయితే గతంలో దరువు, సారొచ్చారు, నిప్పు సినిమాల టైమ్ లో వరుసగా ఫ్లాపులు అందుకున్నాడు రవితేజ. ఒకే ఏడాది 4 అట్టర్ ఫ్లాపులు కూడా వచ్చిన సందర్భాలున్నాయి. దీంతో మాస్ రాజా డీలా పడిపోయాడు. సినిమాల వేగాన్ని తగ్గించాడు. అయితే తాజాగా వరుస విజయాలతో మళ్లీ స్వింగ్ లోకొచ్చాడు రవితేజ. అందుకే మళ్లీ తన పాత పద్దతిలోకి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాడు. ఏడాదికి కనీసం 4 సినిమాలైనా రిలీజయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగానే కిక్-2 రిలీజైన కొద్ది రోజులకే బెంగాల్ టైగర్ సినిమాను కూడా విడుదల చేయాలని భావిస్తున్నాడు రవితేజ.