ఫైట్ తో సినిమా స్టార్ట్ చేస్తే హిట్టే

ఎన్టీఆర్ నయా సెంటిమెంట్ ఇది. ఏదైనా కొత్త సినిమా షూటింగ్ ను ఫైట్ సీక్వెన్స్ తో ప్రారంభిస్తే సినిమా కచ్చితంగా హిట్టవుతుందనే సెంటిమెంట్ ఇప్పుడు తారక్ లో బలంగా నాటుకుంది. అదుర్స్ సినిమాని ఫైట్ సీక్వెన్స్ తోనే ప్రారంభించారు. ఆ సినిమా మంచి విజయాన్నందుకుంది. శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన బాద్ షా సినిమాని కూడా ఫైట్ తోనే ప్రారంభించారు. అది కూడా హిట్టయింది. అంతెందుకు రీసెంట్ గా వచ్చిన టెంపర్ సినిమాని కూడా ఫైట్ సీక్వెన్స్ తోనే షూటింగ్ మొదలుపెట్టారు. ఆ సినిమా కూడా మంచి విజయాన్నందుకుంది. తాజా సెంటిమెంట్ ను ఆధారంగా చేసుకొని అప్ కమింగ్ మూవీని కూడా పైటింగ్ సీన్ తోనే ప్రారంభించాలని ఫిక్స్ అయ్యాడు ఎన్టీఆర్. మే 14 నుంచి సుకుమార్ సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమా షూటింగ్ ను ఫైటింగ్ తోనే ప్రారంభించాలని నిర్ణయించాడు. హైదరాబాద్ లో ఒక ఫైట్ సీన్ తెరకెక్కించిన తర్వాతే ఫస్ట్ షెడ్యూల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు.