అన్నీ మలేషియాలోనే అంటున్న మిత్రవింద

మగధీరలోని మిత్రవింద క్యారెక్టర్ తో పాపులర్ అయిన కాజల్ ఇప్పుడు నిర్మాతలకు సరికొత్త కండిషన్ పెడుతోంది. కాల్షీట్లు ఇస్తాను కానీ షూటింగ్ లు మాత్రం మలేషియాలోనే పెట్టుకోండని కొత్త రూల్ పెడుతోంది. తాజాగా విక్రమ్ తో ఓ సినిమాకు కమిటైంది కలువకళ్ల కాజల్. ఈ సినిమా షూటింగ్ ను కూడా మలేషియాలోనే పెట్టుకోమంటోంది. దీనివెనక ఓ కారణం ఉంది. తమిళ్ లో ఒకేసారి రెండు సినిమాలు చేస్తోంది. ఈ రెండు సినిమాల షూటింగులు మలేషియా దీవుల్లోనే జరుగుతున్నాయి. మరోవైపు తన సమ్మర్ వెకేషన్ లో భాగంగా మలేషియాలోనే సేదతీరుతోంది కాజల్. కాబట్టి ఓ వైపు సమ్మర్ వెకేషన్ ను ఎంజాయ్ చేస్తూనే మరోవైపు సినిమాలు కూడా కానిచ్చేస్తోంది. 5 గంటలు మాత్రమే షూటింగ్ కు కేటాయించి మిగతా టైమ్ లో మలేషియాలో ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తోంది. సో.. విక్రమ్ సినిమాని కూడా ఓ నెల రోజుల పాటు అక్కడే షూటింగ్ పెట్టుకోమని రిక్వెస్ట్ చేసింది. అదీ సంగతి.