ముచ్చటగా మూడోసారి

కొన్ని జంటల్ని తెరపై ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. చూసేకొద్దీ చూడాలనిపిస్తుంది. అప్పట్లో వెంకటేశ్-సౌందర్య జంట అలాంటిదే. ఇప్పటి తరానికొస్తే మహేష్-సమంత, రామ్ చరణ్-కాజల్ కాంబినేషన్లు కూడా అలాంటివే. ఇప్పుడీ కోవలోకి మరో జంట కూడా చేరబోతోంది. అదే శర్వానంద్-నిత్యామీనన్. సెన్సిబుల్ యాక్టర్స్ గా పేరుతెచ్చుకున్న వీళ్లిద్దరూ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యారు. గతంలో శర్వానంద్, నిత్యామీనన్ కలిసి మళ్లీ మళ్లీ ఇది రాని రోజు అనే సినిమా చేశాడు. అది డీసెంట్ హిట్ అనిపించుకుంది. తర్వాత ఏమిటో ఈమాయ అనే మరో సినిమా చేశారు. అది కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఈజంట ముచ్చటగా మూడోసారి కలిసి నటించేందుకు సిద్ధమైంది. మలయాళంలో హిట్టయిన ఓ సినిమాను తెలుగు-తమిళ భాషల్లో తెరకెక్కిస్తోంది పీవీపీ సంస్థ. ఈ సినిమా తెలుగు వెర్షన్ లో నిత్యామీనన్-శర్వానంద్ కలిసి నటిస్తారు. ఓ మై ఫ్రెండ్ సినిమాకు దర్శకత్వం వహించిన వేణు శ్రీరాం ఈ సినిమాకు దర్శకుడు.