ఢైరెక్టర్ కూతురు కేక పెట్టిస్తుంది

బాలీవుడ్ లో మ‌హేష్ భ‌ట్ కు వున్న ఇమేజ్ తెలిసిందే. జిస్మ్, మ‌ర్డ‌ర్, నషా ఈ త‌ర‌హా చిత్రాలు చేయ‌డంలో మంచి పేరున్న ద‌ర్శ‌క నిర్మాత‌. ఇక ఆయ‌న చిన్న కూతురు ఆలియా భ‌ట్ మాత్రం త‌న దైన మార్గంలో వెళ్తుంది.ముఖ్యంగా హాట్ లుక్ ల‌తో ప్ర‌తి సినిమాలోను త‌న‌దైన మార్క్ ఉండేలా చూసుకుంటుంది. లిప్ లాక్ సీన్స్ చేయ‌డానికి ఏ మాత్రం వెన‌కంజ వేయ‌డం లేదు.సినిమాల్లో హాట్ లుక్ తో క‌నిపించ‌డం ఒకెత్తు అయితే.. గ్లామ‌ర్ మ్యాగ‌జైన్స్ క‌వ‌ర్ పైజి ల పై హాట్ గా క‌నిపిస్తూ ఫోజులివ్వ‌డం అనేది మ‌రింత ప్ర‌చారం తెచ్చే మార్గం. బాలీవుడ్ లో చాల మంది హీరోయిన్స్ ఈ ప‌ద్ద‌తినే ఫాలో అవుతుంటారు. స్టార్ లీగ్ లో ఎంట్రి కొట్టిన ప్ర‌తి హీరోయిన్ ఏదో ఒక మ్యాగ‌జైన్ కు ఫోటో షూట్ ఇచ్చి అభిమానుల‌కు మ‌రింత చేరువైన వారే. ఇక ఆలియా భ‌ట్ కూడా తాజాగా ఒక‌ మ్యాగ‌జైన్ కోసం ఫోటో షూట్ చేసింది. సెక్సీ లుక్ లో క‌నిపిస్తూ… ఆలియా భ‌ట్ సంచ‌ల‌నం సృష్టించింది. హీరోయిన్స్ మ‌ధ్య ఎప్పుడు తీవ్ర పోటి వుంటుంది. అభిమానుల్ని ఏదో ఒక ఇదిలో ఉండ‌కపోతే క‌ష్టమే క‌దా. ఆ విష‌యం ఆలియా భ‌ట్ కు బాగా తెలుసు క‌దా.