Telugu Global
Others

టీడీపీ ఎమ్మెల్యేయే నా చావుకు బాధ్యుడు: ఎస్సై లేఖ‌

నా చావుకు ఏసీబీ డిఎస్పీ రంగ‌రాజు, తెలుగుదేశం ఎమ్మెల్యే కె.క‌ళావెంక‌ట‌రావు ఆయ‌న పీఏ నాయుడే కార‌ణం. వారి వేధింపులు త‌ట్టుకోలేక చ‌నిపోవాల‌ని నిర్ణ‌యించుకున్నాను. ఆరు నెల‌లుగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాను. త‌లెత్తుకోలేని ప‌రిస్థితి. విధి నిర్వ‌హ‌ణ‌లో త‌ప్పు చేయ‌లేదు. కానీ అంద‌రూ మోస‌గాడిగా చూస్తున్నారు. అందుకే చ‌నిపోవాల‌ని నిర్ణ‌యించుకున్నా. మ‌ర‌ణం వ‌ద్ద‌కు వెళుతున్నా… ఇది ఆత్మ‌హ‌త్య చేసుకునే ముందు  ఓ ఎస్సై రాసిన లేఖ‌. శ్రీ‌కాకుళం జిల్లా వంగ‌ర పోలీస్ స్టేష‌న్‌లో స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్‌గా ప‌ని చేస్తున్న […]

నా చావుకు ఏసీబీ డిఎస్పీ రంగ‌రాజు, తెలుగుదేశం ఎమ్మెల్యే కె.క‌ళావెంక‌ట‌రావు ఆయ‌న పీఏ నాయుడే కార‌ణం. వారి వేధింపులు త‌ట్టుకోలేక చ‌నిపోవాల‌ని నిర్ణ‌యించుకున్నాను. ఆరు నెల‌లుగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాను. త‌లెత్తుకోలేని ప‌రిస్థితి. విధి నిర్వ‌హ‌ణ‌లో త‌ప్పు చేయ‌లేదు. కానీ అంద‌రూ మోస‌గాడిగా చూస్తున్నారు. అందుకే చ‌నిపోవాల‌ని నిర్ణ‌యించుకున్నా. మ‌ర‌ణం వ‌ద్ద‌కు వెళుతున్నా… ఇది ఆత్మ‌హ‌త్య చేసుకునే ముందు ఓ ఎస్సై రాసిన లేఖ‌. శ్రీ‌కాకుళం జిల్లా వంగ‌ర పోలీస్ స్టేష‌న్‌లో స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్‌గా ప‌ని చేస్తున్న వీరాంజ‌నేయులు విధి నిర్వ‌హ‌ణ‌లో ఒత్తిడిని త‌ట్టుకోలేక‌, విమ‌ర్శ‌ల‌ను భ‌రించ‌లేక రైలు కింద ప‌డి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి గుర‌య్యాడు.
చ‌నిపోతూ ఆయ‌న రాసిన లేఖ జిల్లాలో సంచ‌ల‌నం సృష్టించింది. ప‌ట్టాల వ‌ద్ద ప‌డి ఉన్న మృత‌దేహం వ‌ద్ద జేబులోంచి ఈ లేఖ‌ను రైల్వే పోలీసులు బ‌య‌ట‌కు తీశారు. డీఎస్పీ, ఎమ్మెల్యే వేధింపుల వ‌ల్లే త‌న సోద‌రుడు చ‌నిపోయాడ‌ని, అంత‌కుముందు త‌న‌కు ఫోన్ చేసి తీవ్ర వేద‌న‌కు గురైన విష‌యాన్ని చెప్పి వెక్కివెక్కి ఏడ్చాడ‌ని, తాను త‌ప్పు చేయ‌కుండా విమ‌ర్శ‌ల‌కు గుర‌వుతున్నాన‌ని చెప్పాడ‌ని వీరాంజ‌నేయులు సోద‌రుడు గంగ‌రాజు చెప్పాడు. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌ళావెంక‌ట‌రావు అనుచ‌రులు డ‌బ్బులు పంచుతుండ‌గా అడ్డుకోవ‌డ‌మే త‌న సోద‌రుడు చేసిన నేర‌మ‌ని, అప్ప‌టి నుంచి అత‌ను వేధింపుల‌కు గుర‌వుతూనే ఉన్నాడ‌ని గంగ‌రాజు చెప్పారు.
First Published:  23 April 2015 3:16 AM GMT
Next Story