మాజీ హీరోయిన్ మహేష్ ఫ్యాన్

మహేష్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉండొచ్చు. కానీ సెలబ్రిటీ ఫ్యాన్స్ మాత్రం సమ్ థింగ్ స్పెషల్. అలాంటి ఓ సెలబ్రిటీ మహేష్ కు అభిమానిగా మారిపోయింది. ఆమె మరెవరో కాదు.. ఒకప్పుటి  హీరోయిన్ సుకన్య. 90ల ప్రారంభంలో తెలుగు, తమిళ భాషల్లో కొన్ని హిట్ సినిమాల్లో నటించింది సుకన్య. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ క్యారెక్టర్ రోల్స్ తో ఎంట్రీ ఇచ్చింది. మహేష్ నటిస్తున్న శ్రీమంతుడు సినిమాలో ప్రిన్స్ కు తల్లిగా నటిస్తోంది సుకన్య. ఈ సినిమా సెట్స్ లో మహేష్ బిహేవియర్ చూసి అతడికి అభిమానిగా మారిపోయింది. ఆ విషయాన్ని తన ట్విట్టర్ పేజ్  లో కూడా రాసుకొచ్చింది. మహేష్ అభిమానుల్లో తను కూడా ఒకదాన్నంటూ ట్వీట్ చేసింది. మహేష్ అంత కూల్ పర్సన్ ని ఎక్కడా చూడలేదంటోంది సుకన్య. సహనటుల్ని ఆయన ఎంతో చక్కగా చూసుకుంటారంటూ ప్రశంసల్లో ముంచెత్తుతోంది.