శ్రీకాంత్ కొడుకు కూడా వచ్చేస్తున్నాడు

పూరీ జగన్నాధ్ కొడుకు ఎప్పుడో సినిమాల్లోకి వచ్చేశాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపిస్తూనే ఇప్పుడు ఆంధ్రాపోరీతో సోలో హీరో అయిపోయాడు. ఇదే బాటలో శ్రీకాంత్ కొడుకు కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. తను హీరోగా కొనసాగుతూనే కొడుకును కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని భావిస్తున్నాడు శ్రీకాంత్. హాలీవుడ్ లో సూపర్ హిట్టయిన స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రం స్ఫూర్తితో రూపొందిన ఓ కథ శ్రీకాంత్ కు బాగా నచ్చింది. నిజానికి ఈ కథను పూరి జగన్నాధ్ కొడుకు ఆకాష్ తోనే చేద్దామని కొందరు నిర్మాతలు భావించారు. కానీ తన కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి ఈ కథ సరిగ్గా సూటవుతుందని భావించి శ్రీకాంత్ నిర్ణయించుకున్నాడు. భార్య ఊహ కూడా ఓకే అనడంతో ఎంట్రీకి రంగం సిద్ధమైంది. మరో కొసమెరుపేంటంటే.. ఈ సినిమాని అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై నిర్మించడానికి నాగార్జున ముందుకొచ్చారని సమాచారం.