శృతితో సెటిల్ మెంట్ జరిగిందిలా..

పీవీపీ-శృతిహాసన్ మధ్య కొన్ని రోజులుగా నడిచిన వివాదం సమసిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే కోర్టు వరకు వెళ్లిన వ్యవహారం సింగిల్ సిట్టింగ్ లో ఎలా పరిష్కారమైందని చాలామంది ఆరాతీశారు. ఫైనల్ గా సెటిల్ మెంట్ వ్యవహారాలు బయటకొచ్చాయి. మొదట తనకు అడ్వాన్స్ గా ఇచ్చిన 10లక్షల రూపాయల్ని వెనక్కి తిరిగి ఇచ్చేందుకు ఒప్పుకుంది శృతిహాసన్. దీంతోపాటు తన కాస్ట్యూమ్స్ కు సంబంధించి పీవీపీ ఖర్చుపెట్టిన 8లక్షల రూపాయల్ని కూడా వెనక్కి ఇవ్వడానికి అంగీకరించింది. ఈ రెండు అంశాలతో పాటు పీవీపీ నిర్మించనున్న కొత్త సినిమాలో ఐటెంసాంగ్ చేసేందుకు ఒప్పుకుంది శృతిహాసన్. దీనికి సంబంధించి 4 రోజుల కాల్షీట్లు కూడా కేటాయించింది. ఇంత దిగొచ్చింది కాబట్టే శృతిపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవడానికి పీవీపీ సంస్థ ఒప్పుకుందని సమాచారం. అగ్రిమెంట్ పై సంతకం చేసిన తర్వాత తప్పుకుంటే ఎన్ని చిక్కులొస్తాయో శృతిహాసన్ కు ఇప్పుడు తెలిసొచ్చింది.